దొంగలను తరిమికొట్టిన వృద్ధ దంపతులకు సాహస అవార్డు

సీఎం పళని స్వామి అవార్డు అందిజేసి వారి తెగువను ప్రశంసించారు. అసాధారణ ధైర్యసాహసాల పురస్కారంతో పాటు రూ.2 లక్షల నగదు, స్వర్ణ పతకం, ప్రశంసాపత్రాన్ని అందించారు.

news18-telugu
Updated: August 16, 2019, 5:32 PM IST
దొంగలను తరిమికొట్టిన వృద్ధ దంపతులకు సాహస అవార్డు
షణ్ముగవేల్‌ దంపతులకు సాహస అవార్డు
  • Share this:
వాళ్లు ఆరు పదుల వయసు దాటిన వృద్ధులు..! కానీ వృద్ధాప్యం ఒంటికే తప్ప.. గుండెధైర్యానికి కాదని నిరూపించారు. కత్తులతో దూసుకొచ్చిన దొంగలను తరిమికొట్టి.. వీరులుగా నిలిచారు. అందుకే వారి వీరత్వాన్ని గుర్తించిన ప్రభుత్వం సాహస అవార్డుతో సత్కరించింది. తమిళనాడులో దొంగలను వీరోచితంగా ఎదుర్కొన్న వృద్ధ దంపతులను స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రభుత్వం సన్మానించింది. దంపతులకు సీఎం పళని స్వామి అవార్డు అందిజేసి వారి తెగువను ప్రశంసించారు. అసాధారణ ధైర్యసాహసాల పురస్కారంతో పాటు రూ.2 లక్షల నగదు, స్వర్ణ పతకం, ప్రశంసాపత్రాన్ని అందించారు.

ఆగస్టు 12న తిరునల్వేలి జిల్లా తిరుమంగళం గ్రామంలో షణ్ముగవేల్‌ (70) అనే వృద్ధుడిపై దొంగలు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇంటి ఆవరణలో రాత్రి వేళ ఆరుబయట కుర్చీలో కూర్చున్న వృద్ధుడిపై వెనక నుంచి వచ్చిన ఒక దుండగుడు దాడి చేశాడు. చేతిగుడ్డతో వృద్ధుడి మెడను గట్టిగా చుట్టేసి ఊపిరి ఆడకుండా చేశాడు. అయితే ఇంతలో ఆ వృద్ధుడి భార్య తలుపు తీసుకొని బయటకు వచ్చి చేతికి అందిన చెప్పులు, ప్లాస్టిక్ కుర్చీతో ఆ దుండగుడిపై దాడికి దిగింది. ఇంతలో మరో వ్యక్తి కూడా కొడవలితో వచ్చి మహిళపై దాడి చేసే యత్నం చేశాడు. ఇంతలో షణ్ముగవేల్ తన మెడకు వేసిన గుడ్డను వదిలించుకొని దాడికి దిగాడు. చేతికందిన కుర్చీతో ఇద్దరు దుండగులపై దాడి చేశాడు. అయితే ఇద్దరూ మంకీ క్యాప్‌లు ధరించి ఉండటంతో.. గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయింది.ఇద్దరు వృద్ధుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవ్వడంతో ఇక చేసేదేమి లేక దుండగులు పారిపోయారు. అయితే ఇదంతా ఆ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీల్లో రికార్డ్ అయ్యింది. మరోవైపు పోలీసులు సైతం కేసు నమోదు చేసుకొన నిందితుల కోసం క్లూస్ వెతుకుతున్నారు. వృద్ధదంపతుల సాహసాన్ని పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. షణ్ముగవేల్ దంపతుల వీరోచిత పోరాటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

దొంగలపై దాడి దృశ్యాలు ఇక్కడ చూడండి:
First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు