TAMILNADU CM MK STALIN GIVES PLACE TO 12 OPPOSITION MLAS IN COVID ADVISORY COMMITTEE AK
TamilNadu: కరోనా కట్టడికి కమిటీ.. తమిళనాడులో ఇంత మార్పు ఎవరూ ఊహించలేదు
దాంతో 68 ఏళ్ళ స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠం తొలిసారి అధిరోహించబోతున్నారు. మరోవైపు ‘జయ’ లేని అన్నాడిఎంకే ప్రతిపక్ష స్థానంతోనే సరిపెట్టుకుంది. ఫళనిస్వామి ఆధ్వర్యంలో ఈ పార్టీకి 82 సీట్లు వచ్చాయి. ఈ సీన్ అంతా చూసిన తర్వాత రజినీకాంత్ రాజకీయాల నుంచి శాశ్వత సెలవు తీసుకోవడం మంచిదే అంటున్నారు అభిమానులు.
TamilNadu: రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఏర్పాటు కోవిడ్ అడ్వయిజరీ కమిటీలో ఏకంగా 12 మంది విపక్ష ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు సీఎం స్టాలిన్.
విషయం ఏదైనా అధికార పార్టీలు, ప్రభుత్వాలు ప్రతిపక్షాల అభిప్రాయాలకు అవకాశం ఇవ్వడానికి ఒప్పుకోవు. అందులోనూ రాజకీయ పార్టీల మధ్య విభేధాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటివి జరుగుతాయని ఊహించలేం. కానీ తమిళనాడులో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఏర్పాటు కోవిడ్ అడ్వయిజరీ కమిటీలో ఏకంగా 12 మంది విపక్ష ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు సీఎం స్టాలిన్. ఇందులో గత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరించిన విజయభాస్కర్ కూడా ఉండటం మరో విశేషం. ఈ నెల 13 ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో వచ్చిన సూచన మేరకు స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీకి ముఖ్యమంత్రి స్టాలిన్ చైర్మన్గా వ్యవహరిస్తారు.
కమిటీలో అధికార డీఎంకే తరపున ఎలిలాన్ మినహా మిగతా వారంతా విపక్షాలకు చెందిన ఎమ్మెల్యే ఉండటం గమనార్హం. ఈ కమిటీ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఎఫ్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి నిర్ణయాలు తీసుకోనుంది. సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయం పట్ల అన్నాడీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తామని అన్నారు. సాధారణంగా తమిళనాడులో అధికార విపక్షాల మధ్య రాజకీయ వైరం ఎక్కువగా ఉండేది.
డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. అయితే జయలలిత, కరుణానిధి మరణానంతరం తమిళ రాజకీయాల్లో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీల మధ్య రాజకీయ వైరం కూడా తొలిగిపోయినట్టు కనిపిస్తోంది. ఇక తమిళనాడులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 33181 కేసులు నమోదు కాగా.. 311 మంది చనిపోయారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.