Home /News /national /

TAMIL NADU YOUNG WOMAN MARRIAGE AFTER GIVING BIRTH TO CHILD SU

బిడ్డకు జన్మనిచ్చిన యువతి.. తర్వాత కొద్ది గంటల్లోనే పెళ్లి.. అసలేం జరిగిందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువతికి బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని గంటల్లోనే పెళ్లి జరిపించారు. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

    ఓ యువతికి బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని గంటల్లోనే పెళ్లి జరిపించారు. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని వాలాజాపేటకు చెందిన జ్యోతి.. అదే ప్రాంతానికి చెందిన ఉదయ్‌కుమార్ చాలా కాలంగా ప్రేమించుకున్నారు. ప్రేమలో ఉన్న సమయంలో ఇద్దరి మధ్య శారీరక సంబందం ఏర్పడింది. ఈ క్రమంలోనే జ్యోతి గర్భం దాల్చింది. దీంతో జ్యోతి.. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు ఉదయ్‌కుమార్‌ను కోరింది. అయితే ఉదయ్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. జ్యోతికి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. జ్యోతి గర్భం దాల్చిన సంగతి ఇంట్లో తెలియడంతో.. కుటుంబ సభ్యులు ఆమెకు అబార్షన్ చేయించాలని చూశారు.

    అయితే జ్యోతి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెకు అబార్షన్ చేయించడం కుదరలేదు. దీంతో జ్యోతి గర్భంతోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక, నెలలు నిండటంతో జ్యోతి వాలాజాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. శనివారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డను అక్కడే వదిలేసి పారిపోయేందుకు జ్యోతి యత్నించింది. అయితే ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడంతో అక్కడే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన సిబ్బంది జ్యోతిని తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు.

    ఇవి చదవండి: అత్తను చంపిన అల్లుడు.. అల్లుడిని చంపిన మామ.. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

    Warangal: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కూతురు.. 10 రోజుల గడిచిన దొరకని ఆచూకీ.. పాపం ఆ తండ్రి..

    ఆ తర్వాత జ్యోతి ఇలా చేయడానికి గల కారణాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసులుకు ఈ విషయంపై సమాచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. ఉదయ్‌కుమార్ పిలిపించి.. జ్యోతిని వివాహం చేసుకోకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఉదయ్‌కుమార్.. జ్యోతిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. ఆ వెంటనే పోలీసులు.. జ్యోతి, ఉదయ్‌కుమార్‌లకు పెళ్లి జరిపించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Marriage, Tamil nadu

    తదుపరి వార్తలు