కొన్నిరోజులుగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దేశంలో ప్రస్తుతం నిత్యావసరాల రేట్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే సామాన్య ప్రజలు వెజిటెబుల్స్ కొనడానికి బెంబెలెత్తిపోతున్నారు. అదే విధంగా.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమ నిరసనలను తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) ఒక్కసారిగా చెన్నైలోని మైలాపూర్ లోని ఒక వీధిలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ కొంత మంది కూరగాయల విక్రేతలతో సంభాషించారు. అక్కడ కేంద్ర మంత్రి బంగాళదుంపలను కొనుగోలుచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.
During her day-long visit to Chennai, Smt @nsitharaman made a halt at Mylapore market where she interacted with the vendors & local residents and also purchased vegetables. pic.twitter.com/emJlu81BRh
— NSitharamanOffice (@nsitharamanoffc) October 8, 2022
ఇదిలా ఉండగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఆమ్ ఆద్మీపార్టీ గుజరాత్ లో ప్రచారం స్పీడ్ ను పెంచింది.
ఇప్పటికే ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, (Arvind Kejriwal) పంజాబ్ సీఎం పలుమార్లు గుజరాత్ లో పర్యటించారు. అక్కడ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అంతే కాకుండా ఢిల్లీ మోడల్ డెవలప్ మెంట్ చేసి చూపిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండురోజుల ప్రచారంలో భాగంగా గుజరాత్ లో ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో కేజ్రీవాల్ చేసిన నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన ప్రచార ర్యాలీలో ‘జై శ్రీరాం’ (Jai Shri Ram) అంటూ నినాదాలు చేశారు. అంతే కాకుండా.. బీజేపీ పార్టీ గుజరాత్ లో ఎలాంటి డెవలప్ మెంట్ చేయలేదని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ లేనిపోని అసత్యాలు మాట్లాడుతుందని కేజ్రీవాల్ అన్నారు. ఇదిలా ఉండగా.. కేజ్రీవాల్ నోట.. జైశ్రీరాం నినాదాల పట్ల బీజేపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎన్నికలలో భాగంగా స్టంట్ అంటూ అపోసిషన్ వారు విమర్శిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirmala sitharaman, Tamilnadu, Viral Video