భోజనానికి గ్లాస్ నీళ్లే... చెన్నైలో అత్యంత తీవ్రంగా నీటి కొరత...

Tamilnadu Water Problems : రోజువారీ అవసరాలకు ప్రజలు 6 వేల లీటర్ల ట్యాంకరుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిపోయిందో గ్రహించవచ్చు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 17, 2019, 2:00 PM IST
భోజనానికి గ్లాస్ నీళ్లే... చెన్నైలో అత్యంత తీవ్రంగా నీటి కొరత...
తమిళనాడులో తీవ్ర నీటి కొరత
  • Share this:
Chennai Water Scarcity : తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో తాగునీటి కొరత బాగా పెరిగిపోయింది. 20 లీటర్ల క్యాన్‌ను రూ.40 రూపాయలు పెట్టి కొంటున్నారు. వర్షాలు పడకపోవడంతో... ఆ రాష్ట్రంలో డ్యాములు, రిజర్వాయర్లూ పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. నీరు లేక చాలా ఆఫీసులు, హోటళ్లు క్లోజ్ అయ్యాయి. కొన్ని హోటళ్లు నీరు లేక భోజనాల సెక్షన్ తీసేశాయి. మరికొన్ని ఒక భోజనానికి ఒక గ్లాస్ నీళ్లే ఇస్తామనే కండీషన్ పెట్టాయి. ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులకు నీళ్లు అందించలేక నానా తిప్పలు పడుతున్నాయి. ఇక రైతుల సమస్యలు ఉండనే ఉన్నాయి. బోర్లలో నీరు రావటలేదు. పొలాలు ఎండిపోయాయి. కొత్తగా సాగు చేసే పరిస్థితి లేదు.

water crisis,chennai water crisis,tamil nadu,tamil nadu water crisis,water crisis in chennai,tamil nadu water scarcity,tamil news,tamil nadu news,water scarcity,water crisis in india,water scarcity in tamil nadu,tamil nadu water problem,drinking water,tamil nadu water crisis 2019,chennai water crisis 2019,news in tamil,latest tamil news,tamil nadu water,tamil nadu water news,tamil nadu water falls,తమిళనాడులో నీటి కొరత,నీటి కోసం యుద్ధాలు,నీటి సమస్యలు,తీవ్రమైన నీటి బాధలు, మహిళల ధర్నాలు,
నీటి కోసం ధర్నా చేస్తున్న ప్రజలు


ఒక్క బిందె నీటి కోసం చెన్నైలో మహిళలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. నిద్రపోయే పరిస్థితి కూడా లేదు. జాగారం చేసి మరీ బిందెడు నీళ్లు సంపాదించుకోవాల్సి వస్తోంది. నీటి కారణంగా చెన్నైలో చాలా పనులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ట్యాంకర్ల నీటిని కొనుక్కుందామన్నా... వాటి రేటూ పెంచేశారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురిపించాలి. ఈసారి అలా జరగకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది. రోజువారీ అవసరాలకు ప్రజలు 6 వేల లీటర్ల ట్యాంకరుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిపోయిందో గ్రహించవచ్చు.

ప్రభుత్వం నీటి సరఫరా చెయ్యడంలో చేతులెత్తేస్తోందంటూ చాలా చోట్ల మహిళలు రోడ్లపై ఆందోళనలకు దిగుతున్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. నీటిని పొదుపు చేసే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వం... వాన నీటి కోసం ఎదురుచూస్తోంది.ఇవి కూడా చదవండి :

అత్యంత అరుదైన బ్లూ లాబ్‌స్టర్... దాన్ని ఆ రెస్టారెంట్‌ ఏం చేసిందో తెలుసా...వావ్... తెలివైన మేక... కేటీఆర్ ఆ ట్వీట్ లైక్ చేశారుగా...

మియామీ బీచ్‌లో మహిళ అరెస్ట్... తాబేలు గూడు పాడు చేసిందని...

వాళ్లిద్దరూ లవర్స్... ఆతనిపై యాసిడ్ పోసి... తనపైనా పోసుకుంది... ఎందుకంటే...
Published by: Krishna Kumar N
First published: June 17, 2019, 1:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading