హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Chennai Floods: చెన్నై మునిగిపోతుందా? వామ్మో.. ఏంటా వర్షాలు.. ఎక్కడ చూసినా వరదే..

Chennai Floods: చెన్నై మునిగిపోతుందా? వామ్మో.. ఏంటా వర్షాలు.. ఎక్కడ చూసినా వరదే..

ఇక తెలంగాణలో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు.. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఓ వైపు చలిగాలులు.. మరోవైపు వర్షాలతో జనం ఆందోళన చెందుతున్నారు.

ఇక తెలంగాణలో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు.. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఓ వైపు చలిగాలులు.. మరోవైపు వర్షాలతో జనం ఆందోళన చెందుతున్నారు.

Chennai Rains: వాయుగుండం ప్రభావంతో ఏపీలోని నెల్లూరు జిల్లాలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి అక్కడ ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (Depression in Bay of bengal) ప్రభావంతో తమిళనాడులో కుండపోత వర్షాలు (Tamilnadu rains) కురుస్తున్నాయి. ఐదారు రోజులుగా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో చెన్నై మహానగరం (Chennai Floods) చిగురుటాకులా వణుకుతోంది. ఇవాళ కూడా భారీగా వానలు పడుతున్నాయి. చెన్నైలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయ ఏర్పడింది. చెట్లు నేలకూలుతున్నాయి. ఇవాళ వాయుగుండం తీరం దాటనుండడంతో భీకర వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. చెన్నైతో పాటు కాంచీపురం, చెంగల్‌పట్టు,  తిరువల్లూరు, రాణిపేట్, విల్లుపురం, కడలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

మారనున్న భారత కరెన్సీ రూపం.. కొత్త నాణేలు ఎలా ఉంటాయో తెలుసా?

మహిళల కోసం మంచి బిజినెస్ ఐడియా.. వంటగది నుంచే లక్షలు సంపాధించే ఛాన్స్

ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 170 కి.మీ, పుదుచ్చేరికి 170 కి.మీ. దూరంలో ఉంది. ఇవాళ సాయంత్రం నాటికి ఏపీ, తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వాయుగుండం తీరం దాటే సమయంలోగంటకు 65 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అంతేకాదు వరద ముంపులో ఉన్న వారికి నిత్యావసర సరుకులు,ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని నెల్లూరు జిల్లాలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి అక్కడ ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి

First published:

Tags: Chennai, Chennai rains, Tamilnadu, Tamilnadu rains

ఉత్తమ కథలు