హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Chennai Rains: రేపు, ఎల్లుండి భీకర వర్షాలు.. చెన్నైపై పగబట్టిన వరుణుడు.. నలుగురు మృతి

Chennai Rains: రేపు, ఎల్లుండి భీకర వర్షాలు.. చెన్నైపై పగబట్టిన వరుణుడు.. నలుగురు మృతి

చెన్నైలో వర్షాలు

చెన్నైలో వర్షాలు

Chennai Rains: లోతట్టు ప్రాంతాలు రెండు మూడు రోజులుగా నీటిలోనే ఉండడంతో ప్రజలకు అంటు వ్యాధులు ప్రబలకుండా తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమయింది. లోతట్టు ప్రాంతాల్లో హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తోంది.

తమిళనాడు (Tamilnadu rains) పై వరుణుడు పగబట్టాడు. అల్పపీడన (Low pressure) ప్రభావంతో గత మూడు రోజులుగా తీవ్రమైన వర్షాలు చెన్నైని ముంచెత్తుతున్నాయి. చెన్నైలోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగర శివారులోని ఉన్న జలాశయాలు నిండుకుండల్లా మారాయి. పూండి, చెంబరంబాక్కం, పుళల్ డ్యామ్‌లలో వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ భారీ వర్షాలకు చెన్నై రోడ్లు సరస్సులను తలపిస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. వర్ష సంబంధిత కారణాలతో తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటి వరకు నలుగురు మరణించినట్లు అధికారులు చెప్పారు. 60 ఇళ్లు ధ్వంసమయినట్లు వెల్లడించారు. 75 చెట్లు కుప్పకూలాయి.

Heavy Rains: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో నాలుగు రోజులు భారీ వానలు.. ఎక్కడంటే?


లోతట్టు ప్రాంతాలు రెండు మూడు రోజులుగా నీటిలోనే ఉండడంతో ప్రజలకు అంటు వ్యాధులు ప్రబలకుండా తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమయింది. లోతట్టు ప్రాంతాల్లో హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తోంది. మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా అవసరమైన వైద్య సేవలు అందిస్తోంది.

మరోవైపు ఆగ్నేయ బంగాఖాళాతంం మీదుగా దక్షిణ అండమాన్ సముద్రాన్ని అనుకొని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతవరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తమిళనాడుతో పాటు ఏపీలోని కొని ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  దీనికి సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. 19 జిల్లాల్లో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

Petrol Price Today: ఇవాల్టి పెట్రోల్, డీజిల్ ధరలివే... అక్కడ లీటర్ పెట్రోల్  82.96

అల్పపీడన ప్రభావంతో ఏపీలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో రేపు, ఎల్లుండి భీకర వానలు పడుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ కూడా అప్రమత్తమయింది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక బృందాలను రంగంలోకి దించింది.

First published:

Tags: Chennai rains, Heavy Rains, IMD, Imd hyderabad, Tamilnadu rains