30 ఏళ్లుగా దట్టమైన అడవిలో 15 కిలోమీటర్లు నడుస్తూ.. పోస్టుమ్యాన్ అంకితభావం..

కూనూర్ సమీపంలోని హిల్‌గ్రోవ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ట్రెక్కింగ్ సమీప ప్రాంతాల్లో నివసించే తోటల కార్మికులకు ఉత్తరాలు, పెన్షన్లు పంపిణీ చేసేందుకు పోస్టుమ్యాన్ శివన్ వెళ్లాల్సి వచ్చేది.

news18-telugu
Updated: July 9, 2020, 2:41 PM IST
30 ఏళ్లుగా దట్టమైన అడవిలో 15 కిలోమీటర్లు నడుస్తూ.. పోస్టుమ్యాన్ అంకితభావం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతడో పోస్టుమ్యాన్. తన వృత్తి వచ్చిన ఉత్తరాలను అందరికీ పంచడం. ఉత్తరాలు పంచేందుకు ఆ పోస్టుమ్యాన్ దట్టమైన అడవి ప్రాంతంలో 15 కిలోమీటర్లు నడుస్తూ అందరి మన్ననలను పొందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని డి.శివన్ పోస్టల్ శాఖలో 30 ఏళ్లుగా పోస్టుమ్యాన్‌గా ఉద్యోగం చేస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ చేశాడు. అతడు పోస్టల్ శాఖలో పోస్టుమ్యాన్‌గా చేరినప్పటి నుంచి ఉద్యోగ విరమణ చెందేవరకు దాదాపు 30 ఏళ్ల పాటు దట్టమైన అడవి ప్రాంతంలో రోజూ ఏనుగులు, ఎలుగుబంట్లను దాటుకుంటూ జారే ప్రవాహాలు, జలపాతాలను అధిగమించి 15 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఉత్తరాలు, పెన్షన్ సొమ్ము పంచి వచ్చేవాడు. శివన్ ఎక్కువగా నీలగిరి పర్వతాలు, రైల్వే ట్రాక్‌ల వెంట నడుస్తూ వెళ్లి వచ్చేవాడు. కూనూర్ సమీపంలోని హిల్‌గ్రోవ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ట్రెక్కింగ్ సమీప ప్రాంతాల్లో నివసించే తోటల కార్మికులకు ఉత్తరాలు, పెన్షన్లు పంపిణీ చేసేందుకు పోస్టుమ్యాన్ శివన్ వెళ్లాల్సి వచ్చేది. రిమోట్ ప్రాంతాల్లో పనిచేస్తుండడంతో సొరంగాలు, అటవీ ప్రాంతాల మీదుగా నడిచేవారు. ఈ క్రమంలోనే తరచూ అడవి జంతువులను శివన్ ఎదుర్కొనేవాడు.ఉద్యోగ విరమణ చేసే వయస్సులోనూ తన విధుల పట్ల అంకిత భావాన్ని చూపుతూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయాన్ని ఐఏఎస్ అధికారి సుప్రియ సాహు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు సదరు పోస్టుమ్యాన్ సేవలను ప్రశంసించారు. ప్రజలకు చేసిన కృషి, సేవలకు కృతజ్ఞతలు చెబుతూ అతడు నిజమైన హీరో అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.
Published by: Narsimha Badhini
First published: July 9, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading