అక్కడ రూపాయికే టిఫిన్... ఆశ్యర్యపోయిన ఆనంద్ మహీంద్రా

Coimbatore : హెడ్డింగ్‌లో చెప్పింది నిజమే. అక్కడ ఏ టిఫిన్ అయినా రూపాయే. అదెలా సాధ్యం? అలాంటి హోటల్ ఎలా నడవగలదు? తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 12, 2019, 7:37 AM IST
అక్కడ రూపాయికే టిఫిన్... ఆశ్యర్యపోయిన ఆనంద్ మహీంద్రా
రూపాయికే టిఫిన్ ఇస్తున్న కమలాథల్
  • Share this:
ఈ రోజుల్లో వంద కాగితం తీస్తే... ఓ పూటకు రావట్లేదు. టిఫిన్ తినాలంటే... మినిమం రూ.20 రూపాయలు. కాస్త క్వాలిటీ ఎక్కువగా కావాలంటే రూ.30 నుంచీ రూ.50 అయిపోతున్నాయి. కానీ... మనకు దగ్గర్లో అలాంటి హోటల్ ఉంటే... అదే రూ.30తో మనం నెలంతా టిఫిన్ తినొచ్చు. ఎందుకంటే... అక్కడ టిఫిన్ ఏదైనా సరే రూపాయే. తమిళనాడు... కోయంబత్తూర్‌లో బామ్మ కమలాథల్‌ అనే ముసలామె... నిస్వార్థంతో రూపాయికే టిఫిన్ అందిస్తున్నారు. ఇది తెలిసిన మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఆనంద్ మహీంద్రా మనలాగే ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్లు ఉంటారా అని షాకవుతూ... మనం జీవితాంతం సేవ చేసినా... అది కమలాథల్ చేసిన సేవలో కొంతైనా అవుతుందా అని అనిపిస్తోందన్నారు.
చిత్రమేంటంటే... కమలాథల్ కట్టెల పొయ్యినే వాడటాన్ని గమనించానన్న ఆనంద్ మహీంద్రా... ఆమె వివరాలు ఎవరైనా చెబితే... ఆమె వ్యాపారంలో తాను పెట్టుబడి పెడతానని అన్నారు. ఓ LPG స్టవ్ కొంటానన్నారు. వెంటనే కొంత మంది నెటిజన్లు ఆయన పెట్టిన ట్వీట్‌కి రిప్లై ఇస్తూ... కమలాథల్ వివరాలు అందించారు.

82 ఏళ్ల కమలాథల్... రూపాయికే టిఫిన్ ఎలా ఇవ్వగలుగుతున్నారన్నది అసలు విషయం. ఆమె హోటల్‌లో టిఫిన్ కోసం మూడు కిలోమీటర్ల దూరం నుంచి కూడా జనం వస్తారు. ఆమె ఉదయాన్నే దాదాపు 1000 ఇడ్లీలూ, మైసూర్ బోండాంలు తయారుచేస్తుంది. మార్నింగ్ 6 కల్లా హోటల్ తెరుస్తుంది. ఆమె దగ్గర ఒక్కో ఇడ్లీ రూపాయి మాత్రమే. ఎవరికి ఎన్ని ఇడ్లీలు కావాలో అన్నే కొనుక్కోవచ్చు. అందువల్ల కొంత మంది 5 ఇడ్లీ తిని... రూ.5 ఇస్తారు. ఇంకొందరు 4 తిని.... రూ.4 ఇస్తారు. ఇలా ఎవరిష్టం వాళ్లది. ఒక్క ఇడ్లీ కూడా అక్కడ కొనుక్కోవచ్చు.

చిత్రమేంటంటే ఇదివరకు ఆమె ఒక్కో ఇడ్లీ లేదా ఒక్కో బోండాంని 50 పైసలకే ఇచ్చేది. రాన్రానూ రేట్లు బాగా పెరిగిపోవడంతో... ఇప్పుడు రూ.1కి ఒక ఇడ్లీ లేదా బోండాం ఇస్తోంది. నష్టానికే ఆమె ఈ వ్యాపారం చేస్తుండటం విశేషం. అందుకే... ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్లకు ఇది ఆశ్చర్యం కలిగిస్తోంది.
First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు