Home /News /national /

TAMIL NADU NURSE VANAJA PERFORMED PCR ON A YOUNG MAN WHO WAS CHOKING ON THE ROAD FOR SHORTNESS OF BREATH PRV

Tamilnadu: రోడ్డుపై ఓ యువకుడు కొన ఊపిరితో కొట్టుకుంటుండగా.. చివరి క్షణంలో అక్కడికి ఓ మహిళ వచ్చి..

శ్వాస అందిస్తున్న నర్సు

శ్వాస అందిస్తున్న నర్సు

రోడ్డుపై ఓ యువకుడు పడి ఉన్నాడు. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. శ్వాసేమో అందడం లేదు. ఇంతలో ఓ నర్సు అక్కడికి చేరుకుంది. ఆలోచించకుండా.. అతని ఛాతీపై ప్రెజర్ చేస్తూ (సీపీఆర్ పద్దతిలో) అతన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది.

రోడ్డుపై ఓ యువకుడు పడి ఉన్నాడు. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. శ్వాసేమో అందడం లేదు. ఇంతలో ఓ నర్సు అక్కడికి చేరుకుంది. ఆలోచించకుండా.. అతని ఛాతీపై ప్రెజర్ చేస్తూ (CPR) అతన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందరూ చివరకు ఏమవుతుందోనని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అలా కొన్ని క్షణాల తర్వాత యువకుడు కదలడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నర్సు (Nurse) ధైర్యంతో యువకుడిని రక్షించడం పట్ల అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.  ఈ ఘటన తమిళనాడు (Tamilnadu) లోని తిరువారూర్‌లోని మన్నార్‌గుడి ప్రాంతంలో డిసెంబరు 3న శుక్రవారం సాయంత్రం జరిగింది. మన్నార్ గుడి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో నర్సు (Nurse)గా పని చేస్తున్న వనజ సకాలంలో ఓ నిండు ప్రాణాన్ని కాపాడటంపై అందరూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బైక్‌పై నుంచి పడిపోయిన విద్యార్థి వసంత్‌ (Vasanth)కు సకాలంలో సేవలందించడం పట్ల పలువురు ఆమెను కొనియాడుతున్నారు.

అడ్డంగా మేక రావడంతో..

తిరువారూరు జిల్లా మన్నార్‌గుడి పక్కనే ఉన్న కొత్తూరు ఎస్టేట్‌కు చెందిన నర్సు వనజ (Nurse Vanaja). మన్నార్ గుడి జిల్లా ప్రధాన కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ సంవత్సరం క్రితం కాంట్రాక్టు పద్ధతి (Contract base)లో నర్సుగా పనిచేస్తున్న ఎం. వనజ శుక్రవారం వారాంతపు సెలవుల సందర్భంగా మదుకూరు సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి కుటుంబంతో కలిసి కారు (car)లో ఇంటికి తిరిగి వస్తోంది. వనజ నడుపుతున్న కారు మన్నార్‌గుడి సమీపంలోని 6 లైన్ల కాలువ వైపు వస్తుండగా వసంత్ అనే పాలిటెక్నిక్ విద్యార్థి తన కారుకు ఎదురుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ద్విచక్ర వాహనానికి అడ్డంగా మేక రావడంతో అతని వాహనం అదుపుతప్పి కింద పడిపోయింది (met with accident). ఇది చూసిన నర్సు వనజ వెంటనే కారు ఆపి దగ్గరకు వెళ్లి యువకుడిని పరిశీలించింది. అప్పుడు అతనికి పల్స్ (pulse) ఆగిపోయి ప్రమాదకరమైన స్థితిలో ఉందని తెలిసింది.

30 సెకన్లపాటు కార్డియో..

ఆ విద్యార్థి చుట్టూ ఉన్న జనాన్ని పక్కకు పంపించి.. ఆమె 30 సెకన్లపాటు కార్డియో పల్మనరీ రిససియేషన్ (CPR) చేశారు. అనంతరం విద్యార్థి నెమ్మదిగా స్పృహలోకి వచ్చాడు.

మరో రెండు నిమిషాలపాటు (For two minutes) అదే విధంగా సేవలందించే సరికి అతను నడవగలిగే స్థాయికి చేరడంతో.. అతన్ని 108 అంబులెన్సు ద్వారా తంజావూరు వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. వనజ సకాలంలో సేవలందించడంతో.. వసంత్‌కు ప్రాణాపాయం తప్పిందని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ విజయ కుమార్ తెలిపారు. కాగా.. అత్యంత కీలక సమయంలో వనజ.. వసంత్‌ను కాపాడటానికి సంబంధించిన ఫొటోలు (photos), వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  నెటిజన్లు స్పందింస్తూ.. వనజ సేవలను ప్రశంసిస్తున్నారు. దీంతోపాటు ఆమె ఉద్యోగాన్ని పర్మినెంట్‌ చేయాలని స్టాలిన్‌ ప్రభుత్వాన్ని నెటిజన్లు కోరుతున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Accident, Nursing, Social Media, Tamil nadu, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు