Man Buys Bike with Re 1 coins : ఓ యువకుడు రూపాయి నాణేలతో బైక్ కొనుగోలు చేశాడు. మూడేళ్ల పాటు రూ.2.60 లక్షల రూపాయి కాయిన్లు పోగుచేసి కాస్ట్‌లీ బైక్ కొన్నాడు. తమిళనాడు సేలం జిల్లాకు చెందిన భూబతి అనే యువకుడుకి చాలా రోజుల నుంచి బైక్ కొనుగోలు చేయాలని అనుకుంటేవాడు. మూడేళ్ల పాటు రూ.2.60 లక్షల రూపాయి నాణాలను సేకరించి తన పిగ్గీ బ్యాంకులో వేస్తూ వచ్చాడు. అలా తన డ్రీమ్ బైక్ కొనడానికి సరిపడినంత డబ్బు పోగయ్యాక ఆ చిల్లర నాణేలతో బైక్ షోరూంకు వెళ్లాడు. ఆ రూపాయి నాణేలను తీసుకుని షోరూమ్ కు వచ్చి సిబ్బంది ముందు పోశాడు. చిల్లరతో నేరుగా బైక్ షోరూం వద్దకు చేరుకుని తనకు నచ్చిన కొత్త బజాజ్ డామినార్ బైక్ (New Bajaj Dominar) కొనుగోలు చేశాడు.
భూబతి తీసుకువచ్చిన నగదును లెక్కించేందుకు షోరూమ్ సిబ్బందికి 10 గంటల సమయం పట్టింది. భూబతి,అతని నలుగురు స్నేహితులు,ఐదుగురు షోరూం సిబ్బంది కలిసి కాయిన్ లను లెక్కించారు. అనంతరం,షోరూం సిబ్బంది శనివారం రాత్రి 9 గంటల సమయంలో బజాజ్ డామినర్ బైక్ ను భూబతికి అందజేశారు. అయితే మొదట భూబతి తెచ్చిన రూపాయి నాణేలను స్వీకరించేందుకు షోరూం మేనేజర్ నిరాకరించాడు. ఆ తర్వాత భూబతిని నిరాశపర్చడం ఇష్టం లేక వాటిని స్వీకరించి..భూబతికి బైక్ కీస్ ను అందించాడు.
Tamil Nadu man buys dream bike of Rs 2.6 lakh with Re 1 coins saved over 3 years, store takes 10 hours to count
— The Times Of India (@timesofindia) March 28, 2022
Read: https://t.co/IDC1fiI6WW pic.twitter.com/c3SRtAWMLp
భూబతి.. బిసీఏ గ్రాడ్యుయేట్, నాలుగేళ్ల క్రితం యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించే ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. అప్పట్లో తను కొనుగోలు చేయాలనుకున్న బైక్ ఖరీదు గురించి షోరూంలో అడిగాడు. బైక్ ఖరీదు అప్పుడు రూ.2 లక్షలు ఉండింది. ఇప్పుడు 2 లక్షల 60 వేలు అయ్యింది. తన దగ్గర అప్పుడు తగినంత డబ్బులు లేకపోవడంతో బైక్ కొనుగోలు చేయలేదని..తన సంపాదనలో కొంత భాగం జమ చేసి ఇప్పుడు దానిని కొనుగోలు చేయడం సంతోషంగా ఉందని భూబతి తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.