Home /News /national /

Lockdown: తమిళనాడులో లాక్‌డౌన్.. ఇవన్నీ బంద్.. ఈ-పాస్ లేనిదే ఇతరులకు నో ఎంట్రీ

Lockdown: తమిళనాడులో లాక్‌డౌన్.. ఇవన్నీ బంద్.. ఈ-పాస్ లేనిదే ఇతరులకు నో ఎంట్రీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tamil nadu lockdown: ఏప్రిల్ 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ప్రార్థనా మందిరాలు, పార్క్‌లు, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, జిమ్‌లు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

    కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం  సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రార్థనా మందిరాలు, పార్క్‌లు, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, జిమ్‌లు మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇతర రాష్ట్రాల వారు తమిళనాడుకు వెళ్లాలంటే ఇకపై ఈ-పాస్ తప్పనిసరిగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

    లాక్‌డౌన్ మార్గదర్శకాలు:

    ఏప్రిల్ 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రార్థనాలయాలు మూసివేత

    బ్యూటీ పార్లర్లు, స్పాలు, సెలూన్‌లు, జిమ్‌లు, సినిమా థియేటర్లు, ఆడిటోరియమ్‌లు, బార్లు మూసివేత

    రెస్టారెంట్లు, హోటళ్లు, టీ షాప్స్‌లో కేవలం డైన్ ఇన్‌పై నిషేధం. టేక్ అవేకు మాత్రమే అనుమతి.

    అన్ని రకాల షాపింగ్ మాల్స్, లార్జ్ ఫార్మట్ స్టోర్ల మూసివేత

    వివాహాల్లో 50 మందికి, అంత్యక్రియల్లో 25 మందికి మించి పాల్గొనకూడదు.

    ఐటీ సంస్థలు కనీసం 50శాత మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించాలి.

    స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీల మూసివేత. జాతీయ, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల శిక్షణకు మినహాయింపు

    ఈ కామర్స్‌కు ఆంక్షలతో కూడిన అనుమతులు

    పుదుచ్చేరి మినహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఈ-పాస్ లేనిదే రాష్ట్రంలోకి అనుమతించరు.

    నిత్యావసర సరుకుల దుకాణాలు, అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.


    కాగా, తమిళనాడులో శుక్రవారం 13,776 కొత్త కేసులు నమోదయ్యాయి. వ్యాధి నుంచి 8078 మంది కోలుకోగా..మరో 78 మంది మరణించారు.  తాజా లెక్కలతో తమిళనాడులో నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 10,51,487కి చేరింది. వీరిలో 9,43,044 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 13,395 మంది మరణించారు. ప్రస్తుతం తమిళనాడులో 95,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Corona Vaccine, Coronavirus, Covid-19, COVID-19 cases, Lock down, Lockdown, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు