• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • TAMIL NADU GOVERNMENT APPONTED KANDASWAMY AS NEW DGP AN IPS OFFICER WHO ARRESTED AMIT SHAH IN 2010 NK

అమిత్ షాను అరెస్టుచేసిన IPS ఆఫీసర్... ఇప్పుడు తమిళనాడు DGP... అందుకే అయ్యారా?

అమిత్ షాను అరెస్టుచేసిన IPS ఆఫీసర్... ఇప్పుడు తమిళనాడు DGP... అందుకే అయ్యారా? (image credit - twitter)

Tamil Nadu: తమిళనాడులో DMK ప్రభుత్వం అధికారంలోకి రాగానే... బీజేపీకి వ్యతిరేక నిర్ణయాలు ఉంటాయని అంతా భావించారు. ఇంత త్వరగా ఉంటాయని మాత్రం అనుకోలేదు. నెక్ట్స్ ఏం జరగబోతోంది?

  • Share this:
    Tamil Nadu: తమిళనాడు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) నియామకం వివాదాస్పదం అయ్యింది. MK స్టాలిన్ నేతృత్వంలో కొత్తగా DMK ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... కాస్త ఆచితూచి వ్యవహరించే స్టాలిన్... మరీ బీజేపీతో తాడో పేడో తేల్చుకునేలా వ్యవహరించరులే అనుకున్నారు చాలా మంది. కానీ ఆయన తీరు చూస్తుంటే... కమలంతో కుస్తీకి రెడీ అన్నట్లుగానే ఉంది. ఐపీఎస్ ఆఫీసరైన పి. కందస్వామిని... DGPగా నియమించారు. ఈ కందస్వామి... 2010లో అమిత్ షాను అరెస్టు చేశారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా... అప్పట్లో గుజరాత్ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. సోహ్రబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో ఆయన్ని అరెస్టు చేశారు కందస్వామి. ఇప్పుడు ఆయన్ని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్, డీజీపీగా తమిళనాడు ప్రభుత్వం నియమించింది.

    అన్నాడీఎంకేకి టెన్షన్:
    తమిళనాడు ఎన్నికల ప్రచారంలో... స్టాలిన్ పదే పదే ఓ మాట చెప్పారు. తాము అధికారంలోకి వస్తే... అన్నాడీఎంకే ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపుతామని అన్నారు. అంతేకాదు... మొన్నటిదాకా ప్రతిపక్షంగా ఉన్న DMK... మొన్నటిదాకా సీఎంగా ఉన్న ఎడప్పాటి పళనిస్వామి, ఆయన మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తూ... గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కి చాలాసార్లు కంప్లైంట్లు ఇచ్చారు. అలాగే విజిలెన్స్ విభాగానికీ ఇచ్చారు. కానీ అవేవీ గవర్నర్ పట్టించుకోలేదు. ఎందుకంటే... గవర్నర్... కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. అన్నాడీఎంకే ప్రభుత్వానికి బీజేపీ అండదండలు ఉండటంతో... డీఎంకే ఆరోపణలు, కంప్లైంట్లూ చెత్తబుట్చలోకి వెళ్లిపోయాయనే విమర్శలు ఉన్నాయి. బట్ ఇప్పుడు అధికారం డీఎంకేది కాబట్టి... ప్రతీకారం తీర్చుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


    కందస్వామి... తమిళనాడు కేడర్ ఐపీఎస్ ఆఫీసర్. సీబీఐలో... ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) గా చేశారు. ఈయన అరెస్టు చేసిన తర్వాత... అమిత్ షా పై ఉన్న ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయి.

    ఇది కూడా చదవండి: Horoscope 11-5-2021: ఈ రాశులవారు తలచిన పనులు నెరవేరుతాయి.. శుభవార్త వింటారు

    కందస్వామి... 2007లో గోవాలో ఓ బ్రిటన్ యువతిని రేప్ చేసి చంపేసిన కేసును కూడా డీల్ చేశారు. అలాగే... కేరళలో SNC-లావాలిన్ స్కామ్‌లో పినరయ్ విజయన్‌ని దర్యాప్తు చేశారు. ఇప్పుడా పినరయ్ విజయన్... కేరళ సీఎంగా ఉన్నారు. ఇలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కందస్వామి... నెక్ట్స్ అన్నాడీఎంకే మాజీ మంత్రులపై ఫోకస్ పెడతారని తెలుస్తోంది. అంటే... తమిళరాజకీయాల్లో వేడి కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: