
Photo Credit : Twitter
Tamil Nadu : ప్రస్తుత సమాజంలో సొంతవాళ్లు చనిపోతేనే పట్టించుకోని నాధుడే లేడు. కానీ ఒక మూగజీవి ప్రాణం పోయిందని...
ప్రస్తుత సమాజంలో సొంతవాళ్లు చనిపోతేనే పట్టించుకోని నాధుడే లేడు. కానీ ఒక మూగజీవి ప్రాణం పోయిందని ఒక ఆఫీసర్ వెక్కివెక్కి ఏడ్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లో కెళితే .. తమిళనాడుకు చెందిన ఒక ఫారెస్ట్ రేంజ్ అధికారికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో మనుసుల్ని హత్తుకుంటున్నది. ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని సాదివాయల్ ఎలిఫెంట్ క్యాంప్‌లో తీవ్రంగా గాయపడిన ఒక ఏనుగుకు చికిత్స అందించారు. గాయపడిన ఏనుగుకు సదరు ఫారెస్టర్ దగ్గరుండి మరీ దాని అవసరాలు చూసుకున్నట్లు సమాచారం. అయితే, చివరకు చికిత్స పొందుతూ ఆ ఏనుగు మరణించడంతో అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు అటవీ శాఖ సిబ్బంది ఏర్పాట్లుచేశారు. చికిత్స సమయంలో అవసరాలు చూసిన ఫారెస్ట్ రేంజర్ ఆ ఏనుగుకు కన్నీటి వీడ్కోలు పలికిన వీడియో గుండెలకు హత్తుకునేలా ఉన్నది. ఫారెస్ట్ రేంజర్ ఏడుస్తూ ఏనుగు తొండాన్ని ప్రేమతో సున్నితంగా కొట్టడం చూసిన నెటిజెన్లు పాపం అంటూ నిట్టూరుస్తున్నారు. ఈ వీడియోను భారత అటవీ అధికారి రమేష్ పాండే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాంలో పెట్టగా లక్షలాది మంది వీక్షించారు.
ఇంట్లో పెంచుకునే జంతువులు ఏవైనా.. మనం ఇంటికి రాగానే మనపైకి వచ్చి వాటి ప్రేమను, అభిమానాన్ని చాటుతుంటాయి. మనం రెండు, మూడు రోజులు వాటికి కనిపించకుండా పోయామంటే పిల్లల మాదిరిగానే అవి కూడా మనపై బెంగపెట్టుకుంటాయి. ఆహారం ముట్టుకోకుండా మారాం చేస్తాయి. అంతగా మనుషులతో వాటికి సంబంధం కలిగి ఉంటుంది. ఈ వీడియో చూస్తే ఈ మాటలు నిజమే అన్పిస్తోంది.
Published by:Sridhar Reddy
First published:January 21, 2021, 22:36 IST