Tamil Nadu Custodial Deaths: తమిళనాడు పోలీసుల ‘రాక్షసత్వం’... NHRC సీరియస్

Tamil Nadu Custodial Deaths | తమిళనాడు పోలీసుల బ్రూటాలిటీపై దేశ వ్యాప్తంగానూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో సంచనంరేపుతున్న నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంతో ఈ ఘటనను పోల్చుతూ తమిళనాడు పోలీసును తీరును పలువురు సెలబ్రిటీలు ఎండగట్టారు.

news18-telugu
Updated: July 1, 2020, 6:54 PM IST
Tamil Nadu Custodial Deaths: తమిళనాడు పోలీసుల ‘రాక్షసత్వం’... NHRC సీరియస్
పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మరణించిన జయరాజ్, ఆయన తనయుడు బెనిక్స్(ఫైల్ ఫోటో)
  • Share this:
తమిళనాడులోని ట్యూటికోరిన్ జిల్లాలో తండ్రి, కొడుకుల లాకప్ డెత్ వ్యవహారం ఆ రాష్ట్ర పోలీసులకు ఎప్పటికీ మచ్చలా మిగిలిపోనుంది. తమిళనాడు పోలీసుల దారుణకాండపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్ అంటూ సోషల్ మీడియా నినదిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు డీజీపీ, ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ, ట్యూటికోరిన్ ఎస్పీలకు జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC) నోటీసు జారీ చేసింది. జయరాజ్, బెన్నిక్స్ లాకప్ మరణాలకు సంబంధించి ఆరువారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. సంబంధిత అధికారులు తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టంచేసింది.

ట్యూటికోరిన్ జిల్లాలోని సత్తాన్‌కుళంలో జయరాజ్(59), ఆయన తనయుడు బెనిక్స్(31) మొబైల్ ఫోన్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి షాప్‌ను తెరిచి ఉంచారన్న కారణంగా స్థానిక పోలీసులకు, వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వీరిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు...రిమాండ్‌పై జైలుకు పంపారు. ఆ తర్వాత కోవిల్‌పట్టి ఆస్పత్రిలో తండ్రి, తనయులు ఇద్దరూ మృతి చెందారు. బెనిక్స్ 21న కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించగా...మరుసటి రోజు 22న ఉదయం ఆయన తండ్రి జయరాజ్ మృతి చెందారు. వారిద్దరూ గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిని పోలీసులు లాఠీలతో అమానుషంగా కొట్టినందున తీవ్ర రక్తస్రావమై వారు మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యుతలైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారి వాదనకు బలం చేకూర్చేలా అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ రేవతి..ఆ రోజు రాత్రంతా పోలీసులు తండ్రి, తనయులను కొట్టినట్లు మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.


తమిళనాడు పోలీసుల బ్రూటాలిటీపై దేశ వ్యాప్తంగానూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో సంచనంరేపుతున్న నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతంతో ఈ దారుణ ఘటనను పోల్చుతూ తమిళనాడు పోలీసును తీరును పలువురు సెలబ్రిటీలు ఎండగట్టారు. దేశ, విదేశీ మీడియా కూడా తమిళనాడు పోలీసుల రాక్షసత్వాన్ని తూర్పారబట్టాయి.
First published: July 1, 2020, 6:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading