Home /News /national /

ఇకపై డాక్టర్ పళనిస్వామి....తమిళనాడు ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం

ఇకపై డాక్టర్ పళనిస్వామి....తమిళనాడు ముఖ్యమంత్రికి అరుదైన గౌరవం

తమిళనాడు సీఎం పళనిస్వామి(ఫైల్ ఫోటో)

తమిళనాడు సీఎం పళనిస్వామి(ఫైల్ ఫోటో)

ఎంజిఆర్ ఇనిస్టిట్యూట్ నుంచి డాక్టరేట్ స్వీకరించడం సంతోషంగా ఉందని, ఇక నుంచి కె. పళనిస్వామి పేరు ముందు డాక్టర్ అనే కొత్త పదం చేరుతుందని హర్షం వ్యక్తం చేశారు.

    సీఎం జయలలిత మరణం తర్వాత రాష్ట్రపగ్గాలు చేపట్టిన తమిళనాడు సీఎం పళనిస్వామి అరుదైన సత్కారం అందుకున్నారు. రాజకీయల్లో తనదైన మార్కుతో ఆయన రాష్ట్ర అత్యున్నత పదవిని కాపాడుకుంటూ, తమిళనాట సీనియర్ లీడర్లకే ముక్కున వేలు వేసుకునేలా చేయడంలో పళని స్వామి దిట్ట అనే చెప్పవచ్చు. డాక్టర్ ఎంజీఆర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎడప్పాడి కె పళనిస్వామి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. రాష్ట్ర పరిపాలనలో కొత్త ఒరవడి సృష్టించినందుకు గానూ ఈ అరుదైన గౌరవానికి ఎంపిక చేసినట్లు యూనివర్సిటీ పేర్కొంది. ఈ సందర్భంగా తమిళనాడు సిఎం పళవిస్వామి మాట్లాడుతూ… ఎంజిఆర్ ఇనిస్టిట్యూట్ నుంచి డాక్టరేట్ స్వీకరించడం సంతోషంగా ఉందని, ఇక నుంచి కె. పళనిస్వామి పేరు ముందు డాక్టర్ అనే కొత్త పదం చేరుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

    First published:

    Tags: Palanisami, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు