TAMIL NADU AT LEAST 11 PEOPLE DIED AFTER A TEMPLE CHARIOT FESTIVAL CAME IN CONTACT WITH A LIVE WIRE SK
Tamilnadu: ఆలయ రథోత్సవంలో విషాదం.. కరెంట్ వైర్లు తగిలి 11 మంది భక్తులు మృతి..
విద్యుదాఘాతానికి గురైన రథం
Tamilnadu: కరెంట్ షాక్ కొట్టిన వెంటనే.. రథాన్ని లాగుతున్న భక్తులు కుప్పకూలిపోయారు. వారిని చూసి మిగతా వారు అప్రమత్తమయ్యారు. వెంటనే రథానికి దూరంగా జరిగారు. లేదంటే మరింత భారీ మొత్తంలో ప్రాణనష్టం జరిగేది.
తమిళనాడు (Tamilnadu)లో విషాదం నెలకొంది. ఓ ఆలయ రథోత్సవం(Temple chariot festival)లో అపశృతి చోటు చేసుకుంది. రథనికి కరెంట్ వైర్లు తగలడంతో.. విద్యుత్ షాక్ కొట్టి.. 11 మంది భక్తులు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. తంజావూరు జిల్లా కలిమేడులో మంగళవారం రాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది. కలిమేడులో ఉన్న అయ్యప్ప ఆలయంలో ప్రతి ఏటా రథోత్సవం జరుగుతుంది. కరోనా వల్ల గత రెండేళ్లు ఎలాంటి వేడుకలు జరగలేదు. ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉండడంతో ఘనంగా రథోత్సవాన్ని నిర్వహించారు. '94 అప్పర్ గురుపూజై ' వేడుకలను వైభవంగా జరిపారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయ వీధుల్లో రథోత్సవం నిర్వహించారు. భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. ఐతే ఈ క్రమంలో విద్యుత్ వైర్లు రథాన్ని తాకడంతో.. దాన్ని లాగుతున్న భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది.10 మంది స్పాట్లోనే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Tamil Nadu | At least 10 people died after a temple car (of chariot festival) came in contact with a live wire in the Thanjavur district. More details are awaited. pic.twitter.com/clhjADE6J3
కరెంట్ షాక్ కొట్టిన వెంటనే.. రథాన్ని లాగుతున్న భక్తులు కుప్పకూలిపోయారు. వారిని చూసి మిగతా వారు అప్రమత్తమయ్యారు. వెంటనే రథానికి దూరంగా జరిగారు. లేదంటే మరింత భారీ మొత్తంలో ప్రాణనష్టం జరిగేది. రథం చుట్టుపక్కల నీటి గుంతలుకూడా ఉన్నాయి. దాదాపు 50 మంది భక్తులు.. రథానికి దూరంగా జరిగారని..లేదంటే వారు కూడా మరణించే వారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యుత్ సిబ్బంది కరెంటు సరఫరాను నిలిపివేశారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సభ్యులంతా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మృతుల కుటుంబాలకు రూ.5 ఎక్స్గ్రేషియా ఇస్తామని..త్వరలోనే తాను తంజావూరులో పర్యటించి, మృతుల కుటుంబాలతో మాట్లాడతానని చెప్పారు స్టాలిన్.
Tamil Nadu Assembly observes 2-minute silence on the loss of 11 lives in Thanjavur electrocution incident.
"I will visit Thanjavur to meet the injured and deceased's families," announces CM MK Stalin in the Assembly pic.twitter.com/YUCXACCMlY
అటు ప్రధాని మోదీ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50వేల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.
Tamil Nadu Assembly observes 2-minute silence on the loss of 11 lives in Thanjavur electrocution incident.
"I will visit Thanjavur to meet the injured and deceased's families," announces CM MK Stalin in the Assembly pic.twitter.com/YUCXACCMlY
ప్రమాదంపై పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.