Tamil Nadu Elections: తమిళనాడు లోని శివగంగ నియోజకవర్గంనుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం... గత నవంబర్‌లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని... తమిళనాడు నుంచి పోటీ చేయమని కోరారు. అది రిక్వెస్టులా కాకుండా డిమాండ్లా కోరారు. మళ్లీ ఇప్పుడు అదే డిమాండ్‌ను తెరపైకి తెచ్చి తన వాదన వినిపిస్తున్నారు. ఇదివరకు కార్తీ... కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ ముందు తన అప్లికేషన్ పెట్టారు. అందులో ఏం కోరారంటే... కన్యాకుమారి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో... ప్రియాంక గాంధీ పోటీ చేయాలని కోరారు. గతేడాది సిట్టంగ్ ఎంపీ వసంతమూమర్ కరోనా వల్ల కన్నుమూయడంతో... అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు దానికి ఉప ఎన్నిక ఏప్రిల్ 6న జరగనుంది.
కార్తీకి ఎందుకీ కోరిక అంటే... ప్రియాంక గాంధీ కనుక తమిళనాడు నుంచి పోటీ చేస్తే... అప్పుడు స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతుందనీ... పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ వస్తుందని ఆశిస్తున్నారు. ఏప్రిల్ 6న తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు రాష్ట్రం, పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో కార్తీ మరోసారి తన మనసులో మాటను బయటపెట్టారు.
ప్రియాంక గాంధీ వైపు నుంచి చూస్తే... ఆమెకు ప్రస్తుతం ఇలాంటి ఆలోచన ఉన్నట్లు కనిపించట్లేదు. ప్రధానంగా ఆమె కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతోపాటూ... తన వంతుగా పార్టీని ఐదు రాష్ట్రాల్లో గెలిపించేందకు ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా అసోం ప్రజలతో కలిసిపోతూ... అక్కడి తేయాకు తోటల్లో పని చేస్తూ... అలా తన ప్రచారం సాగిస్తున్నారు. అలాంటి ఆమె... ఆ ప్రచారం పక్కన పెట్టి... తనకు ఓటు వేయమంటూ... ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేవనే వాదన వినిపిస్తోంది. నిజంగా అలాంటి ఆలోచనే ఉంటే... నవంబర్‌లో తొలిసారి కోరినప్పుడే... అక్కడి పరిస్థితులేంటని ప్రియాంక గాంధీ... రాష్ట్ర పార్టీ కమిటీని ఆరా తీసేవారే అంటున్నారు. అలాంటిదేమీ చెయ్యలేదు కాబట్టి... కార్తీ కోరిక ఇప్పట్లో తీరనట్లే అంటున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi Rally: రేపు కోల్‌కతాలో మోదీ ర్యాలీ.. ఆహ్వాన పత్రికల పంపిణీ.. వైరల్ ఫొటోస్
ప్రస్తుతం సీట్ల సర్దుబాటులో భాగంగా... అధికార అన్నాడీఎంకే... తన కూటమిలోని బీజేపీకి 20 సీట్లను కేటాయించింది. ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసింది. అటు కాంగ్రెస్, DMK కూటమిలో మాత్రం సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ తన వాటాగా కనీసం 30 సీట్లు ఇవ్వాలని కోరుతోంది. డీఎంకే మాత్రం 20 సీట్లే ఇస్తామని అంటోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్... 8 చోట్ల మాత్రమే గెలిచింది. అప్పటి కంటే ఇప్పుడు కాంగ్రెస్ మరింత బలహీన పడిందని భావిస్తున్న డీఎంకే... ఒక రకంగా కాంగ్రెస్‌ను తనకు భారంగా భావిస్తున్నట్లు తెలిసింది. ప్రత్యర్థి చిక్కుల్లో ఉండటం తమకు కలిసొచ్చే అంశంగా బీజేపీ-అన్నాడీఎంకే కూటమి భావిస్తున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karti Chidambaram, Priyanka Gandhi