• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • TAMIL NADU ASSEMBLY ELECTIONS 2021 DMK CHIEF STALIN PROMISES RUPEES 1000 AID FOR WOMEN FAMILY HEADS IN TAMIL NADU IF DMK CAME TO POWER NK

Tamil Nadu Elections: మహిళలపై DMK వరాల జల్లు... పవర్ లోకి వస్తారా...

Tamil Nadu Elections: మహిళలపై DMK వరాల జల్లు... పవర్ లోకి వస్తారా...

మహిళలపై DMK వరాల జల్లు... పవర్ లోకి వస్తారా... (File Image)

Tamil Nadu Assembly Elections 2021: మనం అనుకున్నట్లుగానే... సీట్ల సర్దుబాటు పూర్తవగానే... తమిళనాడులో పార్టీలు హామీలు, వరాల జల్లు కురిపించడం ప్రారంభించాయి.

  • Share this:
    Tamil Nadu Elections: జనరల్‌గా తమిళనాడులో ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాదు. కానీ అన్నాడీఎంకే అధినేత్రిగా జయలలిత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. మళ్లీ ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న అన్నాడీఎంకే... బీజేపీతో జట్టు కట్టి బరిలో దిగుతుంటే... ఈసారి ఎలాగైనా తాము అధికారంలోకి వచ్చి తీరాల్సిందే అనుకుంటూ... కాంగ్రెస్‌తో జట్టు కట్టి డీఎంకే బరిలో దిగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం DMK అధినేత స్టాలిన్... తాము గనక అధికారంలోకి వస్తే... ప్రతి కుటుంబంలో ఓ మహిళకు నెలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయంగా ఇస్తామని ప్రకటించారు. ఆ డబ్బుతో మహిళలు... ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపులు) ద్వారా తక్కువ ధరకే నిత్యవసరాలు కొనుక్కోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఆయన 10 ఏళ్లకు సరిపడా విజన్ డాక్యుమెంట్‌ని రిలీజ్ చేశారు.

    మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్‌గా కమల హాసన్... 3 నెలల కిందట ఇలాంటి ప్రకటనే చేసారు. మహిళలు ఇంటి దగ్గరే ఉండి పని చేసుకునేలా తాము డబ్బు ఇస్తామని అన్నారు. అది తమ పార్టీ ఆర్థిక అజెండా అన్నారు. కానీ నెలకు ఎంత డబ్బు ఇచ్చేదీ క్లారిటీగా చెప్పలేదు. ఎన్నికల ప్రచారంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


    స్టాలిన్... ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి ఇస్తున్న విద్యా స్కాలర్‌షిప్‌లను డబుల్ చేస్తామన్నారు. పారిశుధ్య కార్మికులు చేస్తున్న మురుగు నీటి పనుల స్థానంలో పూర్తిగా యంత్రాలు, టెక్నాలజీని తెచ్చేస్తామన్నారు. విజన్ డాక్యుమెంట్‌లో ఆయన ఎకానమీ, వ్యవసాయం, నీటి నిర్వహణ, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, పట్టణ అభివృద్ధి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం వంటి అంశాలతో తమిళనాడును అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ విషయాల్ని ప్రతి ఇంట్లో వారికీ తెలిసేలా ప్రచారం చేయాల్సిందిగా క్యాడర్‌కు పిలుపిచ్చారు. ఆ ఉత్సాహంలో సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామనే హామీ కూడా ఇచ్చారు. డబుల్ డిజిట్ అభివృద్ధిని సాధిస్తామన్నారు. వచ్చే పదేళ్లలో కోటి మందిని పేదరిక రేఖ నుంచి పైకి తీసుకొచ్చేస్తామన్నారు. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా... అమలు సాధ్యమేనా అన్నది లోతైన విశ్లేషణ.


    సీట్ల సర్దుబాటులో భాగంగా... డీఎంకే... కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించింది. వాటితోపాటూ కన్యాకుమారి లోక్ సభ స్థానం సీటును కూడా కాంగ్రెస్‌కే కేటాయించింది. అటు అధికార అన్నాడీఎంకే... బీజేపీకి 20 సీట్లను కేటాయించింది.

    ఇది కూడా చదవండి: Horoscope Today: మార్చి 8 రాశి ఫలాలు... పట్టు వదలని ప్రయత్నాలతో ఫలితాల సిద్ధి

    ఏప్రిల్ 6న తమిళనాడులో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు, అభ్యర్థుల గెలుపోటములు ప్రకటించనున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు