• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • TAMIL NADU ASSEMBLY ELECTIONS 2021 AIADMK ALLOTS 20 SEATS TO BJP FOR TAMIL NADU ASSEMBLY ELECTION NK

Tamil Nadu Assembly Elections: BJPకి అన్నాడీఎంకే ఎన్ని సీట్లు ఇస్తోందంటే...

Tamil Nadu Assembly Elections: BJPకి అన్నాడీఎంకే ఎన్ని సీట్లు ఇస్తోందంటే...

BJPకి అన్నాడీఎంకే ఎన్ని సీట్లు ఇస్తోందంటే... (ప్రతీకాత్మక చిత్రం - File)

Tamil Nadu Assembly Elections 2021: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతోంది. కీలకమైన తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందా?

  • Share this:
    Tamil Nadu Assembly Elections: దక్షిణాది రాష్ట్రాల్లో మరింతగా చొచ్చుకుపోవాలనుకుంటున్న బీజేపీ... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఓ రేంజ్‌లో ఆశలు పెట్టుకుంది. ఇందుకోసం ఎన్నో వ్యూహాలు రచిస్తోంది. ప్రధానంగా సూపర్ స్టార్ రజనీకాంత్... రాజకీయాల నుంచి తప్పుకోవడంతో... ఓ సమస్య తీరిందనుకున్న కమలదళం... ఆ తర్వాత మెల్లగా చిన్నమ్మ శశికళను కూడా సాగనంపిందనే ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా సీట్ల సర్దుబాటులో భాగంగా... అధికార అన్నాడీఎంకే... బీజేపీకి 20 సీట్లను కేటాయించింది. తాజాగా ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ఆ పార్టీ రిలీజ్ చేసింది. అందులో ముఖ్యమంత్రి ఎడప్పాటి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు ఉన్నారు. పళనిస్వామి... ఎడప్పాటి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. పన్నీర్ సెల్వం... బోడినాయకనూర్ నుంచి బరిలో దిగనున్నారు.

    డీఎంకే-కాంగ్రెస్‌లో సర్దుబాటు సమస్య:
    అటు కచ్చితంగా ఈసారి అధికారంలోకి రావాలనుకుంటున్న డీఎంకే... సీట్ల విషయంలో చాలా మొండిగా ఉంది. ఇదివరకు మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లు ఇచ్చినా... ఆ పార్టీలు ప్రభావం చూపలేకపోవడంతో... తమకు ఛాన్స్ మిస్సైందనుకున్న డీఎంకే ఈసారి తానే ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని అనుకుంటోంది. కాంగ్రెస్ తన వాటాగా కనీసం 30 సీట్లు ఇవ్వాలని కోరుతోంది. డీఎంకే మాత్రం 20 సీట్లే ఇస్తామని అంటోంది. వారం నుంచి ఈ పంచాయతీ తేలట్లేదు. కూటమిలో కొనసాగాలా వద్దా అనే సంశయంలో ఉంది కాంగ్రెస్. డీఎంకేను ఒప్పించడంలో విఫలమైతే కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యంతో కలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. డీఎంకే కూడా... కాంగ్రెస్ కూటమిని వీడినా పర్వాలేదు అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు కూటమిలో మిగతా పార్టీలకు కూడా... మూడు, నాలుగు సీట్లు మాత్రమే ఇస్తామనడంతో ఆ పార్టీలు కూడా అసంతృప్తితో ఉన్నాయి.

    ఇది కూడా చదవండి: PM Modi Team: ప్రధాని మోదీ టీమ్‌లో సోనియాగాంధీ, టెండుల్కర్... ఇంకా...

    2016 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్... 8 చోట్ల మాత్రమే గెలిచింది. అప్పటి కంటే ఇప్పుడు కాంగ్రెస్ మరింత బలహీన పడిందని భావిస్తున్న డీఎంకే... ఒక రకంగా కాంగ్రెస్‌ను తనకు భారంగా భావిస్తున్నట్లు తెలిసింది. ప్రత్యర్థి చిక్కుల్లో ఉండటం తమకు కలిసొచ్చే అంశంగా బీజేపీ-అన్నాడీఎంకే కూటమి భావిస్తున్నట్లు సమాచారం.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు