22 ఏళ్ల యువకుడి ప్రాణం తీసిన సెల్ఫీ

ప్రతీకాత్మక చిత్రం

స్నానానికి ముందు సెల్ఫీ తీసుకుంటానంటూ మురళి ఎత్తేన రాయిపై ఎక్కాడు. సెల్ఫీ తీసుకునే క్రమంలో రెండు అడుగులు వెనక్కి వేశాడు.

  • Share this:
    సెల్ఫీ తీసుకుంటూ 22 ఏళ్ల యువకుడు జలపాతంలో పడి చనిపోయిన విషాదకరమైన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడుకు కలందీర్‌కు చెందిన మురళి.. మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. దీపావళి సందర్భంగా మురళి తన స్నేహితుడు మనికందన్, మనికందన్ బంధువు విజయ్ కుమార్‌తో కలిసి జమునామార్థూర్ వద్ద ఉన్న భీమన్ జలపాతానికి వెళ్లారు. అక్కడ మనికందన్, మురళి స్నానం చేయాలనుకున్నారు. అయితే స్నానానికి ముందు సెల్ఫీ తీసుకుంటానంటూ మురళి ఎత్తేన రాయిపై ఎక్కాడు. ఈ క్రమంలో కాలుజారి జలపాతంలో పడిపోయాడు. మురళిని కాపాడపోయి మణికందన్ కూడా కింద పడ్డాడు. అక్కడున్నవాళ్లు వెంటనే ఇద్దర్ని నీళ్లలోకి దిగి బయటకు తీశారు.మురళి తలకు తీవ్రగాయాలుకావడంతో అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయాడు. మణికందన్ తీవ్రగాయాలు పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: