హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Video : కొంచెం విశ్రాంతి తీసుకోండి..తల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్న మోదీని ఓదార్చిన మమతా బెనర్జీ

Video : కొంచెం విశ్రాంతి తీసుకోండి..తల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్న మోదీని ఓదార్చిన మమతా బెనర్జీ

మోదీని ఓదార్చిన మమత

మోదీని ఓదార్చిన మమత

CM Mamata Condoles Pm Modi : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి (PM Narendra Modi Mother) హీరాబెన్ (Heeraben)ఇవాళ ఉదయం కన్నుమూశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

CM Mamata Condoles Pm Modi : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి (PM Narendra Modi Mother) హీరాబెన్ (Heeraben)ఇవాళ ఉదయం కన్నుమూశారు. 100 ఏళ్ల వయసున్న ఆమె వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాసకోస ఇబ్బందులతో మూడు రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె.. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గాంధీనగర్‌లో హీరాబెన్ అంత్యక్రియలు జరిగాయి. తల్లి అంతిమయాత్రలో తల్లి పాడె మోశారు ప్రధాని మోదీ. అతి కొద్ది మంది సమక్షంలో.. చాలా నిరాడంబరంగా హీరాబెన్ అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు. కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ప్రధాని మోదీ తల్లి చితికి నిప్పంటించారు. అయితే హౌరా-న్యూజల్పాయ్‌గురి వందే భారత్ రైలుతో పాటు మెట్రో లైన్‌ను ప్రధాని ప్రారంభోత్సవం కోసం ఆయన ఈరోజు కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. న్యూ జల్పాయ్‌గురి రైల్వే స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరగాల్సి ఉంది. అయితే తన హీరాబెన్ మరణించడంతో.. ప్రధాని మోదీ కోల్‌కతా టూర్ రద్దయింది. ప్రధాని మోదీ ఇవాళ మధ్యాహ్నాం తల్లి అంత్యక్రియలు ముగిసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఓ వైపు తల్లి మరణించిన బాధ ఉన్నా.. కర్తవ్య నిర్వహణను మాత్రం ప్రధాని మోదీ (PM Narendra Modi) మరవలేదు. దు:ఖాన్ని ఆపుకుంటూ.. బాధను గుండెల్లో దాచుకొని.. దేశ ప్రధానిగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు ముగిసిన వెంటనే.. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. శ్మశాన వాటిక నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు  హౌరా- న్యూ జల్‌పైగురిని కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు మోదీ. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతూ.."దయచేసి కొంచెం విశ్రాంతి తీసుకోండి. మీ తల్లి మరణానికి ఎలా సంతాపం చెప్పాలో నాకు తెలియదు, ఆమె మీ అమ్మే కాదు మా అమ్మ కూడా. నాకు నా తల్లిని కూడా గుర్తుకువచ్చింది. మీ పనిని కొనసాగించడానికి దేవుడు మీకు శక్తిని ప్రసాదిస్తాడు" అని తన తల్లి మరణించిన కొన్ని గంటల తర్వాత ఈ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరైన ప్రధానమంత్రితో మమతా బెనర్జీ అన్నారు.

PM Modi Mother: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ మృతిపై రాహుల్‌గాంధీ,చిరంజీవి సంతాపం..ఏమన్నారంటే

ప్రధానమంత్రి తల్లి మరణానికి ఆమె సంతాపం తెలిపారు. ఇంత పెద్ద వ్యక్తిగత నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ కార్యక్రమంలో చేరినందుకు మోదీకి మమత ధన్యవాదాలు తెలిపారు. ఇక,ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించనున్న ఐదు రైల్వే ప్రాజెక్టుల్లో నాలుగింటి పనులను తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించినట్లు మమతా బెనర్జీ చెప్పారు.

First published:

Tags: Mamata Banarjee, Pm modi, PM Modi Mother Heeraben Death, Vande Bharat Train

ఉత్తమ కథలు