news18-telugu
Updated: September 21, 2020, 10:47 AM IST
తాజ్ మహల్(ఫైల్ ఫోటో)
దేశ, విదేశీ పర్యాటకులు, ప్రేమ జంటలకు ఓ గుడ్‌న్యూస్. ఆగ్రాలోని అంతర్జాతీయ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం తాజ్ మహల్ ఆరు నెలల తర్వాత నేడు (21 సెప్టెంబర్) తెరుచుకోనుంది. సోమవారం నుంచి తాజ్ మహల్ సందర్శనకు పర్యాటకులను అనుమతించనున్నట్లు ఏఎస్ఐ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా విజృంభణ కారణంగా లాక్‌డౌన్‌కు ముందే మార్చి 17న తాజ్‌ను మూసేశారు. తాజ్ మహల్ చరిత్రలో ఇన్ని రోజులు మూసివేయడం ఇదే తొలిసారి. కోవిడ్ కారణంగా తాజ్ మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ వంటి ఏర్పాట్లు చేశారు. ఒక రోజులో గరిష్ఠంగా 5000 మంది పర్యాటకులను మాత్రమే తాజ్ సందర్శనకు అనుమతిస్తారు.
తాజ్ మహల్ సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తున్నప్పటికీ...గ్రూప్ ఫోటోలు తీసుకునేందుకు మాత్రం అనుమతించరు. తాజ్ మహల్ లోపల సందర్శకులు ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన టూర్ గైడ్స్ ని మాత్రమే లోనికి అనుమతిస్తారు.
తాజ్ మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులు ముందుగానే ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. స్వదేశీ పర్యాటకులు రూ.50 ఎంట్రీ ఫీజును చెల్లించాల్సి ఉండగా...విదేశీ పర్యాటకుల టికెట్ ధరను రూ.1100గా నిర్ణయించారు.
తాజ్ మహల్ సందర్శన కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ జంటలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. నేటి నుంచి సందర్శనకు అనుమతి ఇస్తుండటంతో దేశానికి విదేశీ పర్యాటకుల రాక పెరిగే అవకాశముంది.
Published by:
Janardhan V
First published:
September 21, 2020, 9:25 AM IST