ట్రంప్ పర్యటన.. సోమవారం తాజ్ మహల్‌ వద్ద కఠిన ఆంక్షలు

యమునా నది నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇప్పటికే 500 క్యూసెక్కుల నీటిని యూపీ ప్రభుత్వం విడుదల చేసింది.

news18-telugu
Updated: February 21, 2020, 10:24 PM IST
ట్రంప్ పర్యటన.. సోమవారం తాజ్ మహల్‌ వద్ద కఠిన ఆంక్షలు
తాజ్ మహల్
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24 నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్‌లో మోతెరా స్టేడియం ప్రారంభించిన తర్వాత ఆగ్రాకు వెళ్లానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తాజ్‌మహల్ వద్ద ఆంక్షలు విధించారు. ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి తాజ్‌మహల్ సందర్శనకు పర్యాటకులను అనుమతించరని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఓ ప్రకటనలో తెలిపింది. సాయంత్రం ట్రంప్ తాజ్ మహల్‌ను వీక్షించనున్న నేపథ్యంలో సాధారణ పర్యాటకులను అనుమతించబోమని వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజ్‌మహల్ సందర్శనకు రానున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి సాధారణ ప్రజలు తాజ్‌ మహల్‌ను చూసేందుకు అనుమతించం.
వసంత్ కుమార్ స్వర్ణకర్ ASI సూపరింటెండెంట్‌

మరోవైపు తాజ్‌మహల్ వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. తాజ్‌‌మహల్ పరిసర ప్రాంతాలు, ట్రంప్‌ ప్రయాణించే మార్గంలో ఉన్న ఇళ్ళు, దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్‌లను పోలీసులు క్షుణ్ణంగా తనీఖీ చేశారు. యమునా నది నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇప్పటికే 500 క్యూసెక్కుల నీటిని యూపీ ప్రభుత్వం విడుదల చేసింది. ట్రంప్‌ తాజ్‌‌మహల్ వరకు వెళ్లే మార్గంలో భారత సంస్కృతి కళ్లకు కట్టే విధంగా చూపేందుకు భారీ ఏర్పాట్లు చేసింది.
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు