Taj Hotel Mumbai : తాజ్ హోటల్స్‌కు బాంబు బెదిరింపు... పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల వార్నింగ్...

Taj Hotel Mumbai : ఇదివరకు ఉగ్రవాదులు దాడులు చేస్తే... చెప్పకుండా చేసేవాళ్లు. ఇప్పుడు అంత సీన్ లేకపోవడంతో... ఇలా బెదిరింపు కాల్స్ చేస్తున్నారా?

news18-telugu
Updated: June 30, 2020, 12:50 PM IST
Taj Hotel Mumbai : తాజ్ హోటల్స్‌కు బాంబు బెదిరింపు... పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల వార్నింగ్...
Taj Hotel Mumbai : తాజ్ హోటల్స్‌కు బాంబు బెదిరింపు... పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల వార్నింగ్...
  • Share this:
Taj Hotel Mumbai : ముంబై పోలీసులు... ట్రాఫిక్ జామ్, కరోనా సమస్యల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో ఓ ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరో ప్రజలు కాల్ చేసి ఉంటారనుకొని... రిసీవ చేసుకున్న ఓ పోలీస్... ఏదీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. అతని కళ్లు పెద్దవయ్యాయి. కను రెప్పలు పడట్లేదు. వేరే పనిలో ఉంటూ... అనుకోకుండా అతనివైపు చూసిన మరో పోలీస్... క్యాహువా అని మరాఠాలో అడిగాడు. ఆ పోలీస్... "ష్... మాట్లాడొద్దు..." అని అనకుండా... చేతులతో అలాంటి సైగ చేశాడు. నిమిషం లోపే కాల్ ముగించిన అవతలి వ్యక్తి... గంభీరంగా మేటర్ ముగించాడు. వెంటనే ఆ పోలీస్... పక్కనున్న పోలీస్‌కి మేటర్... చెప్పడం... వాళ్లిద్దరూ... పై అధికారులకు చెప్పడం... పై అధికారులు... వెంటనే ఎవరెవరికో కాల్స్ చెయ్యడం అన్నీ జరిగాయి.

ఆ తర్వాత కొన్ని నిమిషాలకో... ముంబై... కొలాబాలోని తాజ్ మహల్ ప్యాలెస్, బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. బాంబు స్క్వాడ్ తనిఖీ బృందాలు కుక్కలతో ఎంటరయ్యాయి. ఆ ప్రాంతంలో సెక్యూరిటీ టైట్ అయ్యింది. రెండు హోటల్స్‌నీ బాంబులతో పేల్చేస్తామని ఎవడో పోలీసుల్ని హెచ్చరించాడు. ఆ వ్యక్తి తనను తాను లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ తాలూకని చెప్పుకున్నాడు.

పోలీసులు ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేశారు. అది పాకిస్థాన్ నుంచి వచ్చిందని అర్థమైంది. ప్రస్తుతం ఆ రెండు తాజ్ హోటళ్లూ కరోనా కారణంగా మూసివేసి ఉన్నాయి. ముంబై సైబర్ సెల్ అధికారులు... ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. ఓవైపు చైనాతో భారత్ తలపడుతున్న సమయంలో... చైనాకి వంతపాడుతూ డైలాగ్స్ పేల్చుతున్న పాకిస్థాన్... ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపులకు దిగుతుంతా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
First published: June 30, 2020, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading