గవర్నమెంట్ ఉద్యోగులు టీ-షర్టులతో రావద్దు... ప్రభుత్వ ఆదేశం... అధికారులకు షాక్...

ఉద్యోగులు టీషర్టుల్లో రావొద్దని ఎందుకు ఆ ప్రభుత్వం ఆదేశించింది. ఎక్కడ తేడా వచ్చింది? ఏ ఘటన ఇందుకు కారణమైంది?

news18-telugu
Updated: August 1, 2020, 2:49 PM IST
గవర్నమెంట్ ఉద్యోగులు టీ-షర్టులతో రావద్దు... ప్రభుత్వ ఆదేశం... అధికారులకు షాక్...
గవర్నమెంట్ ఉద్యోగులు టీ-షర్టులతో రావద్దు... ప్రభుత్వ ఆదేశం... అధికారులకు షాక్...
  • Share this:
ప్రభుత్వ ఉద్యోగాల్ని వైట్ కాలర్ జాబ్స్ అంటారు. ఎందుకంటే... షర్ట్ కాలర్ కూడా మాసిపోని విధంగా... ఓన్లీ మైండ్‌కే పని ఉండేలా ఆ ఉద్యోగాలు ఉంటాయన్నది అందరూ చెప్పే మాట. చక్కగా... టిప్‌టాప్‌గా తయారై, టక్ చేసుకొని... షూస్ వేసుకొని... పద్ధతైన విధానంలో ప్రభుత్వ ఆఫీసుకి వస్తే... ప్రజలు, సిబ్బంది అందరూ ఆ ఉద్యోగిని చూసి... ఇన్స్‌పైర్ అవుతారు. తాము కూడా అలా పద్ధతిగా తయారవ్వాలనీ, మరింత పెద్ద ఉద్యోగం సంపాదించాలని అనుకుంటారు. అలా కాకుండా... ప్రభుత్వ ఉద్యోగులు ఏదో వాకింగ్‌కి వెళ్తున్నట్లు టీషర్టులతో ఆఫీసులకు వస్తే ఎలా... ఇది కరెక్టు కాదు. ఇకపై ఇలా చెయ్యడానికి వీల్లేదు అంటూ మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.

టీషర్టులతో ఉద్యోగాలకు వస్తే హుందాగా ఉండదని ప్రభుత్వం తెలిపింది. గ్వాలియర్ డివిజన్‌లోని ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఇకపై టీషర్టులు, మాసిన జీన్స్ ప్యాంట్లతో రావద్దొని ఆదేశించింది. అధికారులు, ఉద్యోగులంతా ఇకపై డీసెంట్, ఫార్మల్ డ్రెస్సుల్లోనే రావాలని డివిజనల్ కమిషనర్ MB ఓఝా... సర్క్యులర్ జారీ చేశారు.

జులై 20న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. ఓ మీటింగ నిర్వహించారు. మండ్సార్ జిల్లాకి చెందిన ఓ అధికారి నిర్లక్ష్యంగా టీ-షర్టుతో మీటింగ్‌లో పాల్గొన్నారు. దీనిపై శివరాజ్ సింగ్ ఫైర్ అయ్యారు. జీతాలు తీసుకుంటున్నప్పుడు... చేసే ఉద్యోగంపై శ్రద్ధ ఉండాలి కదా... మన పని కాదన్నట్లు నిర్లక్ష్యంగా ఉండే ఎలా అని సీఎం అనడంతో... ఉన్నతాధికారులంతా వణికిపోయారు. ఆ తర్వాత రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ అన్ని జిల్లాల అధికారులకూ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, ఉద్యోగులంతా డీసెంట్ లుక్‌తో, ఫార్మల్ డ్రెస్సుల్లోనే రావాలని ఆర్డరేశారు. ఈ ఆదేశాన్ని ఎవరైనా ధిక్కరిస్తే... క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉంటాయని తెలిపారు.

ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఇలాంటి రూల్స్ తెచ్చాయి. టీ-షర్టులు, జీన్స్‌ని వ్యతిరేకించాయి. విదేశాల్లో అంటే అమెరికా, యూరప్ దేశాల్లో చలి ఎక్కువ కాబట్టి... అక్కడి వారు మందమైన డ్రెస్సులు వాడుతారు. అదీ కాక... ఒక్కో జతనూ వారం పాటూ వాడుతారు. అందువల్లే అక్కడ జీన్స్ రూల్స్ చెల్లుతాయి గానీ... ఎండ ఎక్కువగా ఉండే మన ఇండియాలో అలాంటివి సెట్ కావన్నది చాలా రాష్ట్రాల అభిప్రాయం.

గతేడాది బీహార్ ప్రభుత్వం కూడా ఇలాంటి రూల్ తెచ్చింది. లైట్ కలర్ డ్రెస్సులే వేసుకోవాలని చెప్పింది. జీన్స్, టీషర్టులు వాడకూడదని ఉద్యోగులను ఆదేశించింది. తమిళనాడు సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగులకు గతేడాది ఇదేరకమైన ఆర్డర్ జారీ అయ్యింది. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రం ఇలాంటి ఆదేశాలు వద్దన్నారు. ఇలాంటి కండీషన్లు కరెక్టు కాదన్నారు.
Published by: Krishna Kumar N
First published: August 1, 2020, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading