హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Swiggy: లక్ అంటే స్విగ్గీ ఉద్యోగులదే.. సెకండ్ జాబ్ చేసుకునే సూపర్ ఛాన్స్..!

Swiggy: లక్ అంటే స్విగ్గీ ఉద్యోగులదే.. సెకండ్ జాబ్ చేసుకునే సూపర్ ఛాన్స్..!

స్విగ్గీ ఉద్యోగి రెండో జాబ్ కూడా చేసుకోవచ్చు..!

స్విగ్గీ ఉద్యోగి రెండో జాబ్ కూడా చేసుకోవచ్చు..!

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. తమ ఉద్యోగులు సెకండ్ జాబ్ చేసుకోవచ్చని బంపరాఫర్ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ బుధవారం ‘మూన్‌లైటింగ్ పాలసీ’ని (Moonlighting policy) లాంచ్ చేసింది.

సాధారణంగా తమ ఉద్యోగులు సెకండ్ జాబ్ చేస్తానంటే ఏ కంపెనీలు కూడా ఒప్పుకోవు. ఎందుకంటే తమ ఉద్యోగుల్లో ప్రొడక్టివిటీ తగ్గడంతోపాటు పని చేయాలనే ఇంట్రస్ట్ తగ్గుతుందని కంపెనీలు భయపడుతుంటాయి. అయితే తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy) మాత్రం తమ ఉద్యోగులు సెకండ్ జాబ్ చేసుకోవచ్చని బంపరాఫర్ ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ బుధవారం ‘మూన్‌లైటింగ్ పాలసీ’ని (Moonlighting policy) లాంచ్ చేసింది. ఈ పాలసీ ద్వారా ఉద్యోగులు కొన్ని షరతులతో స్విగ్గీలో వర్కింగ్ అవర్స్ తర్వాత ఇతర ప్రాజెక్ట్‌లలో పని చేయవచ్చు. మూన్‌లైటింగ్ పాలసీని ఇండస్ట్రీ-ఫస్ట్ పాలసీగా కంపెనీ పేర్కొంది.

"మా దగ్గర ఫుల్-టైమ్ జాబ్ చేస్తున్న ఉద్యోగులపై ఎలాంటి పరిమితులు పెట్టకుండా, వారు తమ అభిరుచిని కొనసాగించేలా ప్రోత్సహించడమే మా లక్ష్యం. అందుకే మూన్‌లైటింగ్ పాలసీని తీసుకొచ్చాం. వరల్డ్-క్లాస్‌ 'పీపుల్ ఫస్ట్' సంస్థను నిర్మించే దిశగా మేం చేస్తున్న ప్రయాణంలో ఇది మరో మెట్టు" అని స్విగ్గీ మానవ వనరుల విభాగం ప్రధాన అధికారి గిరీష్ మీనన్ పేర్కొన్నారు. స్విగ్గీ ఆఫీస్ అవర్స్ పూర్తయిన తర్వాత లేదా వారాంతాల్లో తమ ఉద్యోగులు ఇతర పనులు చేసుకొనేందుకు ఎలాంటి అభ్యంతరం తెలపడం లేదు. అయితే తన కంపెనీలోని జాబ్‌ ప్రొడక్టివిటీని ప్రభావితం చేయని.. ఆసక్తి తగ్గించని ప్రాజెక్ట్ లేదా యాక్టివిటీని మాత్రమే టేకప్ చేయాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తోంది.

ఇదీ చదవండి: ఓరి నీ సర్ప్రైజ్ పాడుగాను.. హారం పోయిందని పెళ్లికొడుకు నాటకం.. చివరికి ఏం జరిగిందంటే !


స్విగ్గీ ప్రకారం, కోవిడ్-19 వల్ల దేశవ్యాప్తంగా చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఈ దేశంలోని ప్రజలు తమలోని కొత్త ఇంట్రెస్ట్స్, టాలెంట్స్‌ను కనుగొన్నారు. ఈ ఇంట్రెస్ట్స్ లేదా టాలెంట్స్‌తో ఉద్యోగులు కొత్త ఆదాయ వనరులను క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా తమ కుటుంబాలకు ఆర్థికంగా మరింత అండగా ఉండొచ్చు. ఒక NGOలో వాలంటీర్‌గా పని చేయడం లేదా డ్యాన్స్ ట్రైనర్ గా ఉండటం లేదా సోషల్ మీడియా కోసం కంటెంట్ క్రియేట్ చేయడం వంటి పనులు ఉద్యోగులు చేసుకోవచ్చు. ఫుల్-టైమ్ జాబ్ చేసిన తర్వాత ఈ తరహా ప్రాజెక్ట్‌లలో పనిచేయడం అనేది ఒక వ్యక్తి వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతుందని స్విగ్గీ గట్టిగా నమ్ముతుందని ఒక ప్రకటన పేర్కొంది.

కంపెనీ తన ఉద్యోగులు సరిగా పనిచేయలేకపోతే నష్టపోతుంది కాబట్టి మూన్‌లైటింగ్ విధానంలో ఉద్యోగులకు కఠినమైన మార్గదర్శకాలను కూడా పేర్కొంది. స్విగ్గీ యాప్‌ను నడుపుతున్న సంస్థ Bundl Technologiesలో పని చేస్తున్న ఫుల్-టైమ్ ఉద్యోగులు ఈ పాలసీని పొందవచ్చు. Bundl Technologies అనుబంధ సంస్థలు, అసోసియేట్‌లు, గ్రూప్ కంపెనీల్లో పని చేసేవారికి కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. సెకండ్ జాబ్స్/ప్రాజెక్ట్స్‌ అనేవి తన ఉద్యోగుల విధులపై ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని కంపెనీ భావిస్తే ఆమోద ప్రక్రియ అమలులో ఉంటుంది. గత వారం, స్విగ్గీ తన ఉద్యోగులలో ఎక్కువ మంది కోసం పెర్మనెంట్ వర్క్-ఫ్రమ్-ఎయివేర్ పాలసీని కూడా ప్రకటించింది.

First published:

Tags: Employees, Food delivery, New jobs, Swiggy

ఉత్తమ కథలు