Swara Bhaskar: ‘పాకిస్థాన్‌‌పై బీజేపీకి ప్రేమ..అందుకే పాకిస్థానీకి పద్మశ్రీ’

పాకిస్థాన్ నుంచి వచ్చి భారత్‌లో స్థిరపడిన ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడంపై వివాదం కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్‌పై బీజేపీ ప్రేమలో ఉందని..అందుకే పాకిస్థానీకి పద్మశ్రీ అవార్డు ఇచ్చిందని ప్రముఖ సినీ నటి స్వర భాస్కర్ ఎద్దేవా చేసింది.

news18-telugu
Updated: February 3, 2020, 12:36 PM IST
Swara Bhaskar: ‘పాకిస్థాన్‌‌పై బీజేపీకి ప్రేమ..అందుకే పాకిస్థానీకి పద్మశ్రీ’
సినీ నటి స్వరా భాస్కర్(ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్రంలోని బీజేపీ సర్కారు పాకిస్థాన్‌తో ప్రేమలో ఉందంటూ సినీ నటి స్వరా భాస్కర్ ఆరోపించింది. అందుకే పాకిస్థానీకి పద్మశ్రీ అవార్డు ఇచ్చిందని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చి స్థిరపడిన సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడంపై ఈ మేరకు సెటైర్లు వేసింది. పాకిస్థానీకి పద్మశ్రీ అవార్డు ఇచ్చేందుకు దేశ నిబంధనలు అడ్డురాన్నప్పుడు సీఏఎ ఎందుకని మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో జరిగిన ర్యాలీలో ఆమె ప్రశ్నించింది. మోదీ సర్కారు పాకిస్థాన్ జపాన్ని జపించినన్నిసార్లు భక్తురాలైన తన అవ్వ హనుమాన్ చాలీసాను జపించడంలేదని ఎద్దేవా చేసింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది.


విదేశీయులకు భారత పౌరసత్వం కల్పించేందుకు అవసరమైన చట్టాలు ఇప్పటికే ఉన్నాయని..కొత్త చట్టాలు అవసరం లేదని పేర్కొంది స్వరా. ఇప్పడున్న చట్టాల మేరకే అద్నాన్ సమీకి దేశ పౌరసత్వాన్ని ఇచ్చి పద్మశ్రీ అవార్డు ఇవ్వలేదా? అని ప్రశ్నించింది. మోదీ సర్కారు సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులను దూషిస్తూ...పాకిస్థానీకి పద్మశ్రీ ఇస్తోందని ఎద్దేవా చేసింది. నాగ్‌పూర్‌లో కూర్చొని విద్వేష రాజకీయాలు నడుపుతున్నారంటూ ఆర్ఎస్ఎస్‌పై పరోక్ష విమర్శలు చేసింది. మతంతో పౌరసత్వాన్ని ముడిపెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. దేశాన్ని మతం ప్రాతిపదికన విభజించాలని కోరుకునే వారు మహ్మద్ జిన్నా వారసులుగా స్వరా భాస్కర్ ఎద్దేవా చేసింది.



First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు