కేరళలో సంచలనం సృష్టిస్తున్న బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేష్‌ను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. బెంగళూరులో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం అరెస్టును ప్రకటించారు. ఈ కేసులో ఇది రెండో అరెస్టు. స్వప్న సురేష్‌తో పాటు సందీప్ నాయర్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. స్వప్న సురేష్ కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు రేపు కోచిలోని కోర్టులో హాజరుపరచనున్నారు.
తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కాన్సులేట్‌కు చెందిన పార్శిల్లో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్.. కేరళ సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు రాజకీయ దుమారం రేపడంతో పినరయి విజయన్ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో స్వప్న సురేశ్‌ను విధుల్లోకి తీసుకున్నందుకు సీఎం ప్రధాన కార్యదర్శి శివ శంకర్‌పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ సిఫార్సు మేరకు ఎన్ఐఏ విచారణ మొదలుపెట్టింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.