హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

west Bengal : బెంగాల్ రాజకీయాం ..ప్రతిపక్ష నేతగా సువేందు అధికారి

west Bengal : బెంగాల్ రాజకీయాం ..ప్రతిపక్ష నేతగా సువేందు అధికారి

సువేందు అధికారి, మమతా బెనర్జీ

సువేందు అధికారి, మమతా బెనర్జీ

west Bengal : పశ్చిమబెంగాల్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి పేరును ఖరారు చేస్తూ భాజపా నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ఈ విషయాన్ని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

  పశ్చిమ బెంగాళ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రిపై గెలిచిన సువేందు అధికారి ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. దీంతో మమతా బెనర్జీకి అంత్యంత సన్నిహితుడు, అటు బీజేపీలో కీలక నేతగా మారిన సువేంధు అధికారి మమత బెనర్జీల మధ్య మరింత తీవ్ర పోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  పశ్చిమబెంగాల్‌లో బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి పేరును ఖరారు చేస్తూ భాజపా నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ఈ విషయాన్ని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

  భాజపా శాసనసభా పక్షనేతకు తీవ్ర పోటీ ఉన్నప్పటికి నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి ప్రత్యర్థైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విజయం సాధించిన సువేందు అధికారివైపే మొగ్గుచూపింది.

  కాగా పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో నందీగ్రామ్ ఫలితాలపై దేశ ప్రజలు ఆసక్తిగా చూసిన విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే జరిగిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలపై అత్యంత ఆసక్తి నెలకొనగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్ గా ఉన్న సువేందు అధికారి పార్టీ వీడి భాజపాలో చేరడం, అనంతరం ఆయనపై ముఖ్యమంత్రి పోటీకీ దిగడంతో అక్కడ చివరివరకూ తీవ్ర ఉత్కంఠ కొనసాగింది.

  అయితే, బెంగాల్ ఎన్నికల్లో హోరాహోరి సాగిన పోటీలో సువేందు అధికారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 1900 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో అసెంబ్లీలోనూ తృణమూల్‌ కాంగ్రెస్‌ను బలంగా ఎదుర్కోవడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడేందుకు సువేందు అధికారికే సరైన వ్యక్తి అని భాజపా భావించింది.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Bjp, Mamata Banarjee, TMC, West Bengal

  ఉత్తమ కథలు