Home /News /national /

SUSPICIOUS WHITE PIGEON FOUND NEAR PAKISTAN BORDER BIKANER WING IS RED AND STAMPED PVN

Suspicious Pigeon : భారత్ లోకి పాక్ గూఢచారి పావురం..రెక్కలపై కోడ్ భాష!

పాక్ నుంచి వచ్చిన అనుమానాస్పద పావురం

పాక్ నుంచి వచ్చిన అనుమానాస్పద పావురం

Pigeon Found Near Pakistan Border: ప్రముఖ తమిళ్ హీరో కమలహాసన్ తీసిన 'విశ్వరూపం' సినిమాలో ఉగ్రవాదులు పావురాల ద్వారా రహస్య సమాచారాలతోపాటు యురేనియం వంటి అణు ధార్మిక పదార్థాల్ని శత్రుదేశాలకు చేర్చి, అక్కడ పేలుళ్లకు పాల్పడుతూ ఉంటారు

Pigeon Found Near Pakistan Border: ప్రముఖ తమిళ్ హీరో కమలహాసన్ తీసిన 'విశ్వరూపం' సినిమాలో ఉగ్రవాదులు పావురాల ద్వారా రహస్య సమాచారాలతోపాటు యురేనియం వంటి అణు ధార్మిక పదార్థాల్ని శత్రుదేశాలకు చేర్చి, అక్కడ పేలుళ్లకు పాల్పడుతూ ఉంటారు. పావురాల ద్వారా సమాచారం రవాణా అనేది కొత్తవిషం కానప్పటికీ, దాయాది దేశం నుంచి తరచూ అలాంటివి ఎగిరివస్తుండటం వెనుక కచ్చితంగా కుట్రకోణం దాగుందని భావిస్తున్నాయి భారత భద్రతా బలగాలు. తాజాగా పాకిస్తాన్​ సరిహద్దు నుంచి అనుమానాస్పద రీతిలో ఓ పావురం భారత్‌లోకి రావడం కలకలం సృష్టిస్తోంది. పావురం రెక్కలకు ఆంగ్ల భాషాక్షరాలు సహా గణాంకాల రూపంలో గూఢ భాషను అధికారులు గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు... దానిని పోలీస్​ స్టేషన్​లో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. సంకేతాలతో కూడిన భాషను నిఘా విభాగం అధికారులు డీకోడ్‌ చేయడానికి శ్రమిస్తున్నారు.

సాధారణంగా పాకిస్తాన్ నుంచి భారత సరిహద్దులకు పావురాలు వస్తుంటాయి. అనుమానాస్పదంగా ఉన్నవాటిని అధికారులు అదుపులోకి తీసుకుంటారు. వాటి రెక్కలపై స్టాంప్​లు, అంకెల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వాటిని డీకోడ్​ చేసి అది గూఢచర్యానికి సంబంధించినది కాదని నిర్ధరించుకున్న తర్వాతే వాటిని విడిచిపెడతారు. కాగా,ఇటీవలే సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్‌ మహిళకు చేరవేసిన ఓ వ్యక్తిని రాజస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పావురం రెక్కలపై గూఢ భాష రాసి ఉండడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది.

ALSO READ Beggar gifts wife :భార్యపై ప్రేమతో..90వేల రూపాయలతో మోపెడ్ కొన్న బిచ్చగాడు

కాగా,బారత సైన్యానికి చెందిన అత్యంత రహస్య, వ్యూహాత్మక సమాచారాన్ని ఐఎస్ఐ మహిళా ఏజెంట్‌కు చేరవేశాడన్న ఆరోపణలతో రాజస్తాన్‌ పోలీసులు శనివారం ఓ సైనికుడిని అరెస్ట్​ చేశారు. .నిందితుడు జోధ్​పుర్​లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్​ ప్రదీప్​ కుమార్​ అని పోలీసులు తెలిపారు.ఉత్తరాఖండ్ రాష్ట్రానికి​ చెందిన ప్రదీప్​ కుమార్(24)​ మూడేళ్ల క్రితమే సైన్యంలో చేరాడు. ప్రస్తుతం రాజస్తాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జవానుగా విధులు నిర్వహిస్తున్నా డు. ప్రదీప్ కుమార్ కి ఆరు నెలల క్రితం ఫేస్ బుక్ లో ఓ మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు ప్రదీప్. అయితే ఫేస్‌బుక్‌లో పరిచయమైన పాకిస్తానీ మహిళ తాను హిందువునని, బెంగళూరులోని ఆర్మీ నర్సింగ్​ సర్వీస్​ సిబ్బందిగా పరిచయం చేసుకుంది. తర్వాత వాట్సాప్ లో అతడితో చాటింగ్‌ ప్రారంభించింది.

పెళ్లి చేసుకుందామని, అంతకుముందు ఢిల్లీలో కలుద్దామని ప్రదీప్​ను నమ్మించింది. తన వలలో ప్రదీప్ చిక్కుకున్నట్లు నిర్ధరించుకున్న తర్వాత దేశ రహస్యాల గురించి అడగడం ప్రారంభించింది. ఆమె కోరిక మేరకు ఢిల్లీ వచ్చిన ప్రదీప్ సైన్యానికి చెందిన పలు రహస్య పత్రాలను సేకరించి వాట్సాప్ లో ఆమెకు పంపించాడు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Pakistan, Rajastan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు