Home /News /national /

SUSPENSE OVER RAHULS SUCCESSOR LIKELY TO END AT CONGRESS MEET TODAY KHARGE AND WASNIK FRONT RUNNERS NK

కాంగ్రెస్ సారధి ఎవరు? నేడు తేలే ఛాన్స్... రేసులో ఖర్గే, ముకుల్ వాస్నిక్...

సోనియా, రాహుల్ గాంధీ (File)

సోనియా, రాహుల్ గాంధీ (File)

Congress Chief : కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడు ఎవరన్నది ఇవాళ తేలే ఛాన్స్ ఉంది. శుక్రవారం రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. CWC మాత్రమే వారసుణ్ని ఎంపిక చేస్తే సరిపోదన్న ఆయన... PCC ప్రధాన కార్యదర్శులు కూడా ఇందులో పాల్గొనాల్సి ఉందన్నారు.

ఇంకా చదవండి ...
సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ను ఎవరు నడిపిస్తారన్నది ఆ పార్టీకి తలనొప్పి వ్యవహారంగా మారింది. వ్యక్తిస్వామ్యానికి పెద్ద పీట వేసే కాంగ్రెస్‌లో మొదటి నుంచీ గాంధీ కుటుంబానికే పాలనా పగ్గాలు అప్పగిస్తూ వచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ బాధ్యతను కొనసాగించేందుకు ఒప్పుకోకపోవడం... గత నెల్లో తన రాజీనామా సమర్పించడంతో... వారసుడి వేట కొనసాగుతోంది. ఐతే... ఎవర్ని ఎంపిక చెయ్యాలో ఎవరూ నిర్ణయం తీసుకోవట్లేదు. కారణం మళ్లీ గాంధీ కుటుంబమే. ఎవరి పేరు చెబితే రాహుల్, సోనియా ఎలా రియాక్ట్ అవుతారోనన్న ఆలోచనతో... నేతలంతా... ఏ నిర్ణయమూ తీసుకోకుండా... రాహుల్, సోనియా ఎవరి పేరైనా చెబితే... దాన్ని ఆమోదించేద్దాం అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వారసుణ్ని ఎంపిక చేసేందుకు... ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) నేతలు సమావేశం కాబోతున్నారు. ఈ మీటింగ్‌లో తాత్కాలిక అధ్యక్షుణ్ని ఎంపిక చేస్తారనీ, ఆ తర్వాత శాశ్వత అధ్యక్షుడి కోసం త్వరలో ఎన్నికలు జరుగుతాయని తెలిసింది. CWC మాత్రమే వారసుణ్ని ఎంపిక చేస్తే సరిపోదన్న ఆయన... PCC ప్రధాన కార్యదర్శులు కూడా ఇందులో పాల్గొనాల్సి ఉందన్నారు. అందువల్ల ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి గాంధీ ఫ్యామిలీకి నమ్మకస్తులుగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వాస్నిక్ పేర్లు తెరపైకి వస్తున్నాయి.

మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వాస్నిక్ ఇద్దరూ దళిత నేతలే. వాస్నిక్ ఇదివరకూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశారు. మహారాష్ట్ర నుంచీ మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఖర్గే... పక్క రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన వారు. 16వ లోక్ సభలో ఆయన కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించారు. కానీ... ఇద్దరూ మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు.

నేడు CWC మీటింగ్ ఉంది కాబట్టి... నిన్న సోనియా గాంధీ... పార్టీలో కోర్ కమిటీ సభ్యులైన అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. ఎవర్ని ఎంపిక చెయ్యాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఐతే... ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ దేవరా ఆసక్తికర ట్వీట్ చేశారు. సచిన్ పైలట్ లేదా జ్యోతిరాధిత్య సింథియాను రాహుల్ వారసుడిగా ఎంపిక చెయ్యాలని కోరారు. వాళ్లిద్దరికీ ఆ అర్హత ఉందన్నారు. వాళ్లకు దేశమంతా మద్దతు ఉందనీ, పార్టీని తిరిగి పైకి తేవడంలో ఇద్దరూ సమర్థులేనని ట్వీట్ చేశారు.

ఇలాంటి పేర్లు ఎన్ని వినిపిస్తున్నా... చివరకు గాంధీ ఫ్యామిలీయే కీలక పోస్ట్‌లో ఉండాలనే వాదనలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. రాహుల్ కాకపోతే ప్రియాంక గాంధీకి అప్పగించాలని కూడా కోరుతున్నారు. సోనియా గాంధీ మాత్రం... ప్రియాంక విషయంపై మౌనంగానే ఉన్నారు. ఈలోపు కాంగ్రెస్ పార్టీలో నేతలు... వేరే పార్టీలు చూసుకుంటున్నారు. జంపింగ్స్‌ని ఆపే పరిస్థితి కాంగ్రెస్‌లో కనిపించట్లేదు.

బెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణాటక. ఇటీవలే అక్కడ అధికార కాంగ్రెస్, జేడీఎస్‌ కూటమిలో నేతలు బీజేపీవైపు టర్న్ తీసుకోవడంతో... ఏకంగా ప్రభుత్వమే కుప్పకూలింది. మహారాష్ట్రలోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచీ అధికార బీజేపీ, శివసేన లోకి నేతలు జంప్ అవుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు... అసోం నుంచీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అమేథీలో గాంధీ కుటుంబానికి సన్నిహితులుగా ఉండే సంజయ్ సిన్హా కూడా... పార్టీని వీడారు.

అసోంలో పార్టీ చీఫ్ విప్, ఎంపీ అయిన భుబనేశ్వర్ కాలిటా కూడా రాజీనామా చేశారు. ఆ సమయంలో... రాజ్యసభలో త్రిపుల్ తలాక్ బిల్లుపై కీలక ఓటింగ్ జరుగుతోంది. కాలిటా శుక్రవారం బీజేపీలో చేరారు. ఇటీవల కొన్ని కీలక అంశాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ నిర్ణయాల్ని సమర్థిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ విషయంలో బీజేపీ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు దీపేందర్ హుడా, సింథియా సమర్థించారు.
Published by:Krishna Kumar N
First published:

Tags: Congress chief, Rahul Gandhi, Sonia Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు