కాన్పూర్ కాల్పుల కేసు.. గ్యాంగ్ స్టర్‌కు ఉప్పందించిన ఇన్‌స్పెక్టర్ అరెస్ట్...

కాన్పూర్ కాల్పుల కేసులో సస్పెండ్ అయిన ఇన్ స్పెక్టర్ వినయ్ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: July 8, 2020, 6:59 PM IST
కాన్పూర్ కాల్పుల కేసు.. గ్యాంగ్ స్టర్‌కు ఉప్పందించిన ఇన్‌స్పెక్టర్ అరెస్ట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్ కాల్పుల కేసులో సస్పెండ్ అయిన ఇన్ స్పెక్టర్ వినయ్ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేకి అతడు ఉప్పందించినట్టు పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలో వినయ్ తివారీని అరెస్ట్ చేశారు. గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఉండే గ్రామం వినయ్ తివారీ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటుంది. హత్యలు, కిడ్నాప్‌లు, అక్రమ రవాణా వంటి సుమారు 60 కేసుల్లో నిందితుడు అయిన వికాస్ దూబేను పట్టుకునేందుకు సుమారు 50 మంది పోలీసుల బృందం తెల్లవారుజామున రైడింగ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే, పోలీసులు పట్టుకోవడానికి వస్తున్నారంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే గ్యాంగ్ స్టర్‌కు ఫోన్ వెళ్లింది. దీంతో గ్యాంగ్ స్టర్ అలర్ట్ అయ్యాడు. పోలీసులు వచ్చే దారిలో జేసీబీ అడ్డం పెట్టి వాళ్లు దిగిన తర్వాత వారిమీద వికాస్ దూబే గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే, అతడి అనుచరులు పారిపోయారు. తాజాగా, వారిలో కొందరిని పట్టుకున్నారు. ఒకడిని కాల్చి చంపారు.

కాన్పూర్ కాల్పుల తర్వాత ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వికాస్ దూబేకి కొందరు పోలీసులే సహకారం అందిస్తున్నారని ముఖ్యంగా, చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వినయ్ తివారీ హస్తం ఉందని ఆరోపిస్తూ గతంలో ఓ డీఎస్పీ అప్పటి కాన్పూర్ ఎస్పీకి లేఖ రాశారు. ఆ డీఎస్పీని కూడా ఇలాగే దొంగ దెబ్బ తీసి చంపేశాడు వికాస్ దూబే. ఆ లేఖపై కూడా ప్రస్తుతం యూపీ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 8, 2020, 6:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading