ఇది పాకిస్తాన్ గూఢచార పావురం.. కాశ్మీర్‌లో కలకలం

గతంలోనూ గూఢచర్యం కోసం వినియోగిస్తున్నట్లు చెప్పే పలు పక్షులను భద్రతా దళాలు పట్టుకున్నారు. సోమవారం దొరికిన పావురం కూడా గూఢచర్యం శిక్షణ పొంది ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

news18-telugu
Updated: May 25, 2020, 6:43 PM IST
ఇది పాకిస్తాన్ గూఢచార పావురం.. కాశ్మీర్‌లో కలకలం
పోలీసుల అదుపులో పావురం
  • Share this:
జమ్మూకాశ్మీర్‌లోని కథువాలో కలకలం రేగింది. ఓ అనుమానాస్పద గూఢచార పావురం పట్టుబడింది. పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తుండగా మన్యారి గ్రామస్తులు పట్టుకున్నారు. హిరానగర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దులోని కంచె సమీపంలో ఈ పావురం దొరికింది. దానికి కాలికి ఓ రింగ్, దాని మీద కొన్ని నెంబర్లు ఉండడంతో స్థానికులు పోలీసులకు అప్పగించారు. రింగ్‌పై ప్రత్యేక కోడింగ్‌తో ఉన్న అంకెలు ఉండడంతో గూడఛార పావురంగా భావిస్తున్నామని జిల్లా ఎస్పీ శైలేంద్ర మిశ్రా తెలిపారు. ఈ కోడ్‌ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మన కంచె సమీపంలో స్థానికులు పట్టుకున్నారు. పావురం కాలికి ఒక రింగ్ ఉంది. దాని మీద కొన్ని నంబర్లు ఉన్నాయి. దర్యాప్తు చేస్తున్నాం.
శైలేంద్ మిశ్రా


గతంలోనూ గూఢచర్యం కోసం వినియోగిస్తున్నట్లు చెప్పే పలు పక్షులను భద్రతా దళాలు పట్టుకున్నారు. సోమవారం దొరికిన పావురం కూడా గూఢచర్యం శిక్షణ పొంది ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. చొరబాట్లకు సంబంధించే కేసులను దర్యాప్తు చేసే ఆపరేషన్స్ గ్రూప్‌ కూడా దీన్ని పరిశీలిస్తోందని అధికారులు తెలిపారు.
First published: May 25, 2020, 6:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading