ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. ఓ గ్రామంలోకి చొరబడి కాల్పులతో విరుచుకుపడ్డారు. సంస్మరణ సభ జరుగుతున్న సమయంలో తుపాకు మోత మోగించారు. దుండగుల కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో గ్రామ పెద్దతో పాటు మైనర్ బాలుడు కూడా ఉన్నారు. కాంగ్‌పోక్పి జిల్లా బి గామ్నమ్ ప్రాంతంతో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల దాడితో గ్రామంలో తీవ్ర అలజడి రేగింది. గ్రామస్తులంతా భయంతో వణికిపోయారు. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఐదుగురు పౌరులను పొట్టన పెట్టుకున్న ముష్కరుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. కుకీ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.
Manipur: Suspected Kuki militants opened fire at a crowd gathered at B Gamnom village in Kangpokpi yesterday for cremation of 2 militants who were neutralised by security forces
"5 people have been killed. 3 bodies have been recovered. Search is going on," said IG Lunseih Kipgen pic.twitter.com/3y0y9v0MmA
— ANI (@ANI) October 13, 2021
సినీ ఫక్కీలో అడవిలోకి వెళ్లిన దొంగ.. పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు.. ఆ తర్వాత..
ఆదివారం మఫౌ డ్యామ్ సమీపంలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ప్రాంతంలో కుకీ ఉగ్రవాదుల సంచారం ఎక్కువగా ఉండడంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. వారికి ఉగ్రవాదులు తారసపడడంతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో, భద్రతా దళాలు కూడా ప్రతిదాడి చేశాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టులు మరణించారు. ఉగ్రవాదుల మృతికి సంతాపంగా బి గామ్నమ్ ప్రాంతంలో ఎంపీ ఖుల్లెన్ గ్రామస్తులు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గ్రామ పెద్ద హాజరై ప్రసంగించారు. ఆ సమయంలోనే కొందరు సాయుధులు గ్రామంలోకి చొరబడి కాల్పులతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో గ్రామ పెద్దతో పాటు నలుగురు పౌరులు మరణించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manipur, National, Terror attack