జాదవ్‌ కేసు తీర్పుపై సుష్మా స్వరాజ్ స్పందన... ఆ ఇద్దరికి కృతజ్ఞతలు

ICJ Verdict on Kulbhushan Jadhav | ఐసీజే తీర్పుపై సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా స్పందించిన సుష్మా స్వరాజ్... కుల్‌భూషణ్ జాదవ్ కేసులో తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇది భారత్‌కు ఇది గొప్ప విజయమన్నారు.

news18-telugu
Updated: July 17, 2019, 7:27 PM IST
జాదవ్‌ కేసు తీర్పుపై సుష్మా స్వరాజ్ స్పందన... ఆ ఇద్దరికి కృతజ్ఞతలు
సుష్మాస్వరాజ్(ఫైల్ ఫోటో)
  • Share this:
కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై బీజేపీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీమంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. ఈ తీర్పు జాదవ్ కుటుంబ సభ్యులకు గొప్ప ఓదార్పు అని అన్నారు. ఐసీజే తీర్పుపై సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా స్పందించిన సుష్మా స్వరాజ్... కుల్‌భూషణ్ జాదవ్ కేసులో తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇది భారత్‌కు ఇది గొప్ప విజయమన్నారు. కేసును ఐసీజే దృష్టికి తీసుకువెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, విజయవంతంగా వాదనలు వినిపించిన హరీష్ సాల్వేకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గతంలో విదేశాంగశాఖ మంత్రిగా వ్యవహరించిన సుష్మా... అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి ఈ కేసును తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.

Sushma swaraj on Kulbhushan Jadhav verdict,Sushma swaraj,kulbhushan jadhav,pm narendra modi,harish salve,india,Pakistan,కులభూషణ్ జాదవ్ కేసుపై సుష్మా స్వరాజ్ స్పందన,సుష్మా స్వరాజ్,కులభూషణ్ జాదవ్,ప్రధాని నరేంద్రమోదీ,భారత్,పాకిస్థాన్
సుష్మాస్వరాజ్ ట్వీట్స్


ఇక అంతర్జాతీయ కోర్టు కులభూషణ్ జాదవ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పాక్ కోర్టు విధించిన తీర్పును నిలిపివేసింది. భారత్, పాక్ జడ్జిలు సహా 16 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. దీంతో అంతర్జాతీయ వేదికపై భారత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. పాక్ మిలటరీ కోర్టు విధించిన శిక్షను పున:సమీక్షించాలని న్యాయమూర్తులు సూచించారు. కాగా, 2016లో కుల్‌భూషణ్ జాదవ్‌ను బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అక్కడి మిలిటరీ కోర్టు.. 2017లో అతడికి మరణ శిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. పాక్ చర్యను తీవ్రంగా తప్పుబట్టింది. అమాయకుడైన కులభూషణ్ జాదవ్‌‌ను దోషిగా చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ సాగిన తుది విచారణలో భారత్‌, పాకిస్తాన్‌లు తమ వాదనలను న్యాయస్ధానానికి నివేదించాయి.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>