హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Covid 19 Vaccine: కరోనా టీకాను వాళ్లు వేసుకుంటేనే మేం కూడా తీసుకుంటాం.. సర్వేలో షాకింగ్ నిజాలు

Covid 19 Vaccine: కరోనా టీకాను వాళ్లు వేసుకుంటేనే మేం కూడా తీసుకుంటాం.. సర్వేలో షాకింగ్ నిజాలు

తొలివిడత కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా 5 మిలియన్ల మంది ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు కరోనా టీకా వేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కేవలం 2,000 మందిపై మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ నమోదయ్యాయి. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ తీసుకునేందుకు 60శాతం మంది భారతీయులు నిరాకరిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది.

ఇంకా చదవండి ...

  మనదేశంలో కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రస్తుతం రెడీగా ఉన్నవారు కేవలం 42శాతం మంది మాత్రమే. కానీ ఎక్కువ మంది కరోనా టీకాను తీసుకునేలా చేయాలంటే మాత్రం ముందు రాజకీయ నాయకులు ఈ వ్యాక్సిన్ తీసుకోకతప్పదు, పొలిటీషియన్స్ కరోనా టీకా తీసుకుంటే తాము కూడా వేసుకుంటామని చెబుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.. ఇలా చేస్తే 65శాతం మంది భారతీయులు టీకా తీసుకునేందుకు సై అంటారని తాజా సర్వే తేల్చింది. 26 శాతం మంది ప్రజలైతే తాము కనీసం మరో మూడు నెలలు వేచి చూసి ఆ తరువాత కరోనా టీకా తీసుకుంటామని చెబుతుండటం విశేషం. కోవిడ్-19 టీకాను మనదేశంలో పంపిణీ చేయబట్టి మూడు వారాలు అవుతున్నా చాలా తక్కువ మంది మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తిచూపుతున్నారు.

  ఈ టీకాపై విముఖత చూపుతున్న వారి జనాభా 16శాతం తగ్గింది. సీనియర్ రాజకీయ నాయకులు టీకా డోసు తీసుకుంటే ఇది అత్యధికులకు టీకాపై విశ్వాసాన్ని పెంపొందించటం ఖాయం. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కరోనా టీకా వేసుకుంటే తాము కూడా వేసుకుంటామని 39శాతం మంది ప్రజలు బాహాటంగానే ప్రకటించారని Local Circles సర్వేలో తేలింది.

  విదేశాల్లో పరిస్థితి వేరే..

  విదేశాల్లో అయితే రాజకీయనాయకులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు టీకా వేసుకుంటూ కామన్ మ్యాన్ కు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా కరోనా టీకా తీసుకున్నారు. బ్రిటన్ లో కూడా క్వీన్ ఎలిజబత్, ప్రధాని బోరిస్ జాన్సన్ టీకా తీసుకున్నట్టు సమాచారం. మనదేశంలో కూడా ప్రధానితో సహా అందరు పొలిటీషియన్స్ కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ లో ఏదో ఒక టీకా తీసుకోవాలని విపక్షాలు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ చెబుతున్నా స్పందన మాత్రం అంతంత మాత్రమే ఉంది. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫాం అయిన లోకల్ సర్కిల్ చేసిన సర్వేలో తేలిన ఈ విషయాన్ని మరి మన రాజకీయ నాయకులు పట్టించుకుంటారా?

  వెయిట్ చేస్తాం..

  కనీసం మరో మూడు నెలలు వేచి చూసి ఆ తరువాత టీకా వేసుకుంటామని 26శాతం మంది భారతీయులు వెల్లడించగా.. మూడు నుంచి 6 నెలలపాటు వేచి చూసి ఆతరువాత కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు రెడీ అని 16 శాతం మంది తేల్చారు. 9శాతం మంది మాత్రం 6-12 నెలలు వెయిట్ చేసి ఆతరువాతనే టీకా వేసుకునేందుకు అంగీకారం చెబుతామన్నారు. మరో 5శాతం మంది భారతీయులు తాము ఒక ఏడాదిపాటు వెయిట్ చేస్తామని చెబుతున్నారు. ఇక మిగిలిన 5శాతం మంది అయితే తాము టీకా అస్సలు తీసుకోమని తెగేసి చెప్పారు.. హెల్త్ కేర్ వర్కర్లలో కూడా ఇదే విముఖత కనిపిస్తోంది. వీరిలో 55శాతం మంది వ్యాక్సినేషన్ పై ఎటు తేల్చుకోలేకపోతున్నారు.

  త్వరలో 50 లక్షల మందికి..

  తొలివిడత కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా 5 మిలియన్ల మంది ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు కరోనా టీకా వేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కేవలం 2,000 మందిపై మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ నమోదయ్యాయి. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ తీసుకునేందుకు 60శాతం మంది భారతీయులు నిరాకరిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఇలా టీకాపై విముఖత వ్యక్తచేస్తున్నవారంతా వ్యాక్సిన్ తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే భయపడటం, సంకోచించటం వంటి అనుమానాల నేపథ్యంలోనే వెనక్కి తగ్గుతున్నారు. కానీ క్రమంగా వ్యాక్సిన్ పై నెలకొన్న అపోహలు, భయాందోళనలు తగ్గుతుండటం మంచి పరిణామం. వందశాతం వ్యాక్సినేషన్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరి, ప్రజలంతా కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవాలంటే టీకాను ఆశ్రయించాల్సిందేనంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

  First published:

  Tags: Almonds Health Benefits, COVID-19 vaccine, Health benefits and secrets

  ఉత్తమ కథలు