హోమ్ /వార్తలు /జాతీయం /

Surgical strike2: బాలాకోట్ ఎక్కడుంది? అసలు యూసుఫ్ అజర్ ఎవరు?

Surgical strike2: బాలాకోట్ ఎక్కడుంది? అసలు యూసుఫ్ అజర్ ఎవరు?

బాలాకోట్ ఉగ్రస్థావరం, యూసుఫ్ అజర్

బాలాకోట్ ఉగ్రస్థావరం, యూసుఫ్ అజర్

యూసఫ్ అజర్ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాకోట్ ఉగ్రవాద స్థావరంలో సుమారు 500 మందికి శిక్షణ ఇస్తున్నారు. యూసుఫ్ అజర్‌ని ఉస్తాద్ గోహ్రీగానూ పిలుస్తారు. 1999 ఐసీ-814 విమానం హైజాక్‌కు పాల్పడింది యూసుఫ్ అజరే..!

  బాలాకోట్..! పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ వైమానిక దళం దాడి చేసింది ఇక్కడే..! పీవోకేలోని ముజఫరాబాద్, చకోటితో పాటు బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. బాలాకోట్ పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫంఖ్తుఖ్వాలోని ఉంది. మన్సెరా జిల్లాలో ఉన్న ఈ పట్టణం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కి 198 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాలాకోట్‌లోని అడవుల్లో ఉన్న ఓ కొండ ప్రాంతంలో జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ బావమరిది యూసుఫ్ అజర్ ఆధ్వర్యంలో అక్కడ అతిపెద్ద ఉగ్రవాద శిబిరం నడుస్తోంది.


  బాలాకోట్‌లో ఉన్న జైషే మహ్మద్ ట్రైనింగ్ క్యాంప్ 6 ఎకరాల్లో విస్తరించింది ఉంది. అందులో 600 మంది వరకు ఉండొచ్చు. అందులో ఫైరింగ్ రేంజ్‌తో పాటు స్మిమ్మింగ్ పూల్, జిమ్ సౌకర్యాలు ఉన్నాయి. దట్టమైన అడవులు, కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో యువతకు శిక్షణ ఇస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీరీ యువతను రెచ్చగొట్టి రాక్షసులుగా మారుస్తున్నారు. తుపాకుల వాడకం, బాంబులు వేయడంతో కఠోర శిక్షణ ఇప్పించి..అనంతరం కశ్మీర్‌లో వదులుతున్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత బాలాకోట్ ఉగ్రస్థావరంపై ఇంటెలిజెన్స్ ప్రత్యేక నిఘాపెట్టింది.


  నిఘా వర్గాల సమాచారం మేరకు ఫిబ్రవరి 26న అర్ధరాత్రి దాటిన తర్వాత ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది ఎయిర్ ఫోర్స్. 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో దాడులు చేసింది. లేజర్ గైడెడ్ బాంబులను ఉపయోగించి ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను నేలమట్టం చేశారు. వైమానిక దళం పశ్చిమ కమాండ్ చేసిన ఈ దాడిలో సుమారు 350కి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు వైమానిక దళ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా మసూద్ అజర్ సోదరులు ఇబ్రహీం అజర్, మౌలానా తాల్హా సైఫ్, మసూద్ అజర్ బావమరిది యూసఫ్ అజర్‌తో పాటు జైషే కమాండర్లు ముఫ్తీ అజార్ ఖాన్, మౌలానా అమ్మర్‌ని టార్గెట్‌గా ఈ దాడులు జరిపారు. ఐతే దాడుల సమయంలో వీరంతా అక్కడే ఉన్నారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.


  యూసఫ్ అజర్ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలాకోట్ ఉగ్రవాద స్థావరంలో సుమారు 500 మందికి శిక్షణ ఇస్తున్నారు. యూసుఫ్ అజర్‌ని ఉస్తాద్ ఘోరీగానూ పిలుస్తారు. 1999 ఐసీ-814 విమానం హైజాక్‌కు పాల్పడింది యూసుఫ్ అజరే..! గతంలో హర్కతుల్ అంసార్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో మసూద్ అజర్ భారత భద్రతా బలగాలకు చిక్కాడు. మసూద్‌ని విడిపించేందుకు అతడి బావమరిది యూసుఫ్ అజర్ రంగంలోకి దిగాడు. తమ అనుచరులతో కలిసి భారత విమానం ఐసీ-814ని హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లారు. మసూద్ అజర్‌ని విడిచిపెడితేనే 160 మంది ప్రయాణికులను వదలేస్తామని కండిషన్ పెట్టడడంతో..తప్పనిసరి పరిస్థితుల్లో అజర్‌ని విడుదల చేసింది భారత్ ప్రభుత్వం.


  అప్పటి నుంచి వీరిద్దరు పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బావల్‌పూర్ కేంద్రంగా మసూద్ అజర్.. జైషే మహ్మద్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఇక అతడి సోదరులు, బావమరిది బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తారు. భారత వైమానిక దళం దాడి చేసింది ఈ శిక్షణా కేంద్రంపైనే..! బాలాకోట్‌తో పాటు ముజఫరాబాద్, చకోటిలోని ఉగ్రస్థావరాలపై యుద్ధ విమానాలతో బాంబు దాడులు చేసింది. ఐతే దాడుల సమయంలో పాకిస్తాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్స్‌తో అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇండియన్ ఫైటర్ జెట్స్ సంఖ్య ఎక్కువగా ఉండడంతో తోకముడిచింది.

  First published:

  Tags: Indian Air Force, Pulwama Terror Attack, Surgical Strike 2

  ఉత్తమ కథలు