పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుల్లెట్ల వర్షం కురిపించింది. భారత సైన్యం కాల్పుల్లో పాకిస్థాన్‌వైపు కూడా భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరిన్ని దురాగతాలకు పాల్పడుతోంది. వారం రోజుల వ్యవధిలో పాక్ సైన్యం బరితెగింపుల వల్ల నలుగురు అమాయకులు అమరులయ్యారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా చేసేందుకు, భారత్‌లో అలజడి సృష్టించాలనుకుంటున్న పాక్.. అనేక కుట్రలు పన్నుతోంది. సరిహద్దుల్లో నుంచి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సరిహద్దుల వద్ద హైఅలర్ట్ కొనసాగుతూనే ఉంది.
అయితే సరిహద్దుల వెంట డ్రోన్లతో కూడా దాడులు చేసేందుకు పాక్ కుట్రలు పన్నుతోంది. ఇటీవల పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లో వీటి ఉనికిని కూడా గుర్తించారు. తాజగా రక్షణ స్థావరాలపై కూడా దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్లాన్లు వేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో.. పంజాబ్, కశ్మీర్‌లోని రక్షణ స్థావరాల వద్ద అలర్ట్ ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India pakistan, India VS Pakistan, Pakistan army, Pakistan infiltration