మిరాజ్ 2000... ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన యుద్ధ విమానం. భారత వైమానిక దళానికి చెందిన ఈ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు జరిపింది. టెర్రరిస్టుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో మిరాజ్ 2000 యుద్ధ విమానం గురించి చర్చ మొదలైంది. డసాల్ట్ ఏవియేషన్ లైసెన్స్‌తో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసిన 12 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్-2000 విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఇప్పుడే కాదు... కార్గిల్ యుద్ధంలోనూ భారతదేశానికి కీలకంగా ఉపయోగపడ్డాయి. డసాల్ట్ కంపెనీ తయారు చేసిన మిరాజ్ విమానాలు శతృ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో కీలకం. ఇప్పట్లాగే కార్గిల్ యుద్ధం సమయంలో కూడా మిరాజ్ విమానాలు శతృ స్థావరాలను ధ్వంసం చేసి గర్వంగా తిరిగొచ్చాయి. అప్పుడు కార్గిల్ యుద్ధంలో భారతదేశం పైచేయి సాధించడానికి కారణం మిరాజ్ 2000 విమానాలే. ఆ తర్వాత మరిన్ని మిరాజ్ విమానాలను ఆర్డర్ చేసింది భారత ప్రభుత్వం.
ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ తయారుచేసిన మిరాజ్ 2000 యుద్ధంలో అనేక పాత్రలు పోషిస్తుంది. 1970లో మిరాజ్ తయారీ మొదలైతే 1984 నుంచి ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్‌కు సేవలు అందిస్తోంది. మిరాజ్ 2000లో సింగిల్ సీటర్, టూసీటర్ మల్టీరోల్ ఫైటర్లున్నాయి. ఈ విమానంలో తొమ్మిది చోట్ల ఆయుధాలను తీసుకెళ్లొచ్చు. ఎయిర్ టు ఎయిర్ అంటే ఆకాశం నుంచి ఆకాశంలోకి బాంబుల్ని వేయగల సత్తా మిరాజ్ 2000 యుద్ధవిమానానికి ఉంటుంది. మైకా మల్టీ టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్సెప్ట్, యుద్ధ క్షిపణులు, మ్యాజిక్ 2 యుద్ధ క్షిపణులను మోసుకెళ్లగలదు. MBDA BGL 1000 లేజర్ గైడెడ్ బాంబ్, MBDA AS30L, MBDA ఆర్మాట్ యాంటీ రాడార్ మిస్సైల్, MBDA AM39 Exocet యాంటీ షిప్ మిసైల్, MBDA రాకెట్ లాంఛర్లు, MBDA Apache స్టాండ్ ఆఫ్ వెపన్స్‌ని మోసుకెళ్తుంది.
మిరాజ్ 2000లో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ (WDNS) ఉంటుంది. పగలు, రాత్రి లేజర్-గైడెడ్ వెపన్స్ ఫైర్ చేయొచ్చు. ఒక్క నిమిషంలో 1,200 నుంచి 1,800 రౌండ్లు ఫిరంగుల్ని పేల్చగలదు. మిరాజ్ 2000 గరిష్టంగా గంటకు 2,530 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మిరాజ్ 2000 యుద్ధ విమానాల్లో పలు రకాలున్నాయి. Mirage 2000C, Mirage 2000B, Mirage 2000N, Mirage 2000D, Mirage 2000-5F, Mirage 2000-5 Mark 2, Mirage 2000E, Mirage 2000M, Mirage 2000H, 2000I, Mirage 2000P, Mirage 2000-5EI, Mirage 2000-5EDA, Mirage 2000EAD/RAD, Mirage 2000EG, Mirage 2000BR, Mirage 2000-9... ఇవన్నీ మిరాజ్ యుద్ధ విమానాల్లో వేరియంట్లు. ప్రస్తుతం భారతదేశం దగ్గర 2000H మోడల్ 42, 2000TH మోడల్ 8 యుద్ధ విమానాలున్నాయి. మిరాజ్‌కు 'వజ్ర' అని పేరుపెట్టింది ఐఏఎఫ్. 1999లో కార్గిల్ యుద్ధంలో మిరాజ్ 2000 యుద్ధ విమానం అందించిన సేవలు మర్చిపోలేనివి. ఇప్పుడు అదే మిరాజ్ 2000 యుద్ధ విమానం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది.
Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'
ఇవి కూడా చదవండి:
Nokia 9 PureView: ఐదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్‌వ్యూ... ఫీచర్లు ఇవే
Health Apps: బరువు తగ్గాలా? ఈ 7 యాప్స్ ట్రై చేయండి
Personal Finance: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Air Force, Indian Army, Pulwama Terror Attack, Surgical Strike 2