పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత వైమానిక దళం జరిపిన దాడుల్ని సర్జికల్ స్ట్రైక్-2 అని పిలుస్తున్నారు. ఈ ప్రతీకార దాడికి సర్జికల్ స్ట్రైక్ అని పేరు పెట్టడానికి కారణం 2016లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్. 2016 సెప్టెంబర్ 29న భారతదేశం సర్జికల్ దాడుల్ని జరిపింది. దానికి ముందు భారతదేశంలోని యూరీలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడులు జరిపి 19 మంది సైనికుల్ని బలితీసుకున్నారు. దానికి ప్రతీకారంగా భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. ఇప్పట్లాగే అప్పుడు కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లిన భారత సైన్యం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.
ఏం జరుగుతుందో పసిగట్టి శతృవు కోలుకునే లోపే శతృ శిబిరాలను ధ్వంసం చేయడమే సర్జికల్ స్ట్రైక్ ప్రత్యేకత. 2016లో ఈ సర్జికల్ స్ట్రైక్స్‌ని పక్కా వ్యూహంతో సక్సెస్ చేసింది భారత సైన్యం. అయితే ఈ సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ముందు చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఎక్కడ టార్గెట్ చేయాలి? ఎప్పుడు టార్గెట్ చేయాలి? టార్గెట్ ఏరియాలో ఎవరెవరున్నారు? వారి కార్యకలాపాలేంటీ? ఏ సమయంలో ఎక్కువ మంది ఉంటారు? ప్రత్యర్థుల్ని పసిగట్టడానికి శతృవర్గం ఏర్పర్చుకున్న రక్షణ వ్యవస్థ ఏంటీ? ఆ రక్షణ వ్యవస్థను ఎలా కౌంటర్ చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? శతృవు కోలుకునే లోపు ఎలా దెబ్బతీయాలి? మనవైపు ఎలాంటి నష్టం లేకుండా వెనక్కి ఎలా వచ్చేయాలి? ఇలా వీటన్నింటితో భారీ వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. సర్జికల్ స్ట్రైక్స్ చేయడంలో పారా కమాండోలదే కీలక పాత్ర. సర్జికల్ స్ట్రైక్స్ చేయాలంటే ఇండియన్ ఆర్మీలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం అవసరం.
సరిగ్గా ఇలాంటి వ్యూహంతోనే 2016లో సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారత సైన్యం. వారం ముందు నుంచే ఉగ్రవాద శిబిరాలపై నిఘా పెట్టి వారి కదలికల్ని గుర్తించి సర్జికల్ దాడులు జరిపింది ఇండియన్ ఆర్మీ. అర్థరాత్రి సమయంలో పీఓకేలోకి వెళ్లి మొత్తం ఏడు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు సైనికులు. ఈ దాడుల్లో 40 మంది ఉగ్రవాదులు, 9 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని అంచనా. గాయపడ్డవారి సంఖ్య లెక్కేలేదు. తాజాగా భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో 200-300 మంది చనిపోయారని అంచనా.
Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'
ఇవి కూడా చదవండి:
Surgical Strike 2: మిరాజ్ 2000 యుద్ధ విమానం ప్రత్యేకత ఏంటీ?
Nokia 9 PureView: ఐదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్‌వ్యూ... ఫీచర్లు ఇవే
Health Apps: బరువు తగ్గాలా? ఈ 7 యాప్స్ ట్రై చేయండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Air Force, Indian Army, Pulwama Terror Attack, Surgical Strike 2