హోమ్ /వార్తలు /జాతీయం /

Surgical Strike 2.. బాలాకోట్‌‌‌ టెర్రర్ క్యాంప్ గురించి ఐదు కీలక అంశాలు

Surgical Strike 2.. బాలాకోట్‌‌‌ టెర్రర్ క్యాంప్ గురించి ఐదు కీలక అంశాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Surgical Strike 2 | జైషే మహ్మద్ ఉగ్రవాదులకు బాలాకోట్‌లో ట్రైనింగ్ ఇస్తుంటారు. తాజాగా 60 మంది బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చారు. అందులో సూసైడ్ బాంబర్స్ కూడా ఉన్నారు.

  పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ఆక్రమతి కాశ్మీర్‌లో మూడు చోట్ల మెరుపుదాడులు చేసింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సేనలు.. జైషే మహ్మద్ స్థావరాలపై ఎటాక్ చేశారు. ఈ దాడిలో అత్యంత ప్రధానమైనది పాకిస్థాన్‌లోని ఖైబర్‌పంక్త్‌లో ఉండే బాలాకోట్. ఇది టెర్రరిస్టుల ట్రైనింగ్ క్యాంప్. దీనికి సంబంధించి భారత ఇంటెలిజెన్స్ నివేదికను న్యూస్‌18 సంపాదించింది. ఇక్కడ ఏమేం కార్యక్రమాలు జరిగాయి? అనే విషయాలను తెలుసుకుంది. దీంతోపాటు బాలాకోట్ అంటే ఎక్కడ అనే సందేహం కూడా చాలా మందిలో ఉంది. LoCలో ఒక బాలాకోట్ ఉంది. పాకిస్థాన్ ప్రధాన భూభాగంలో మరో బాలాకోట్ ఉంది. అక్కడే భారత వైమానిక దళాలు మెరుపుదాడి చేశాయి.


  1. జైషే మహ్మద్ ఉగ్రవాదులకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంటారు. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజర్ కొడుకు అబ్దుల్లా కూడా ఇక్కడ ట్రైనింగ్ పొందాడు. 2017 డిసెంబర్‌లో ఇక్కడ అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత మరో పది రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ పొందాడు.


  2. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల మీద ఉగ్రదాడి చేయాలన్న పన్నాగం కూడా ఇక్కడిదే. దీని ప్లాన్ కూడా ఇక్కడే రెడీ చేశారు. పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ ఘాజీ కూడా ఇక్కడే ట్రైనింగ్ పొందాడు.


  3. తాజాగా 60 మంది జైషే మహ్మద్ కొత్త ఉగ్రవాదుల బ్యాచ్ ఇక్కడే మూడు నెలల పాటు శిక్షణ పొందింది. అందులో కొందరు సూసైడ్ బాంబర్స్ కూడా ఉన్నారు.


  4. బాలాకోట్‌లోని టెర్రరిస్ట్ క్యాంప్‌లో ఐదు నుంచి ఆరు బ్యారెక్స్ ఉంటాయి. కొత్త ఉగ్రవాదులను రెడీ చేయడానికి అందులో మరికొన్ని కట్టడాలు నిర్మిస్తున్నారు.


  5. బాలాకోట్‌లోని జైషే మహ్మద్ స్థావరంలో ఎప్పుడూ కనీసం 200 నుంచి 300 మంది ఉంటారు.

  First published:

  Tags: Indian Air Force, Pakistan, Pulwama Terror Attack, Surgical Strike 2

  ఉత్తమ కథలు