సర్జికల్ స్ట్రైక్స్ 2.0... తాజాగా భారత సైన్యం జరిపిన దాడిని అందరూ ఇలాగే అభివర్ణిస్తున్నారు. నిజంగానే ఇది సర్జికల్ స్ట్రైక్ 2.0. ఎందుకంటే 2016 సెపబ్టెంబర్లో జరిపిన మొదటి సర్జికల్ స్ట్రైక్ కన్నా ఇప్పుడు జరిపిన దాడి అతి పెద్దది. భారత సైన్యం ఇంత దూకుడుగా విరుచుకుపడటానికి పలు కారణాలున్నాయి. అందులో ప్రధానమైన మూడు కారణాలు ఇవే.
1. 2016 సెప్టెంబర్ 29న సర్జికల్ స్ట్రైక్‌కు సరిగ్గా 11 రోజుల ముందు యూరీలో భారత సైనిక స్థావరంపై దాడి జరిపిన ఉగ్రవాదులు 19 మంది సైనికుల్ని బలితీసుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 29న భారత సైన్యం ఎల్ఓసీ సమీపంలోని పూంఛ్, కుప్వారాలో సర్జికల్ స్ట్రైక్ జరిపింది. అయితే మంగళవారం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ మాత్రం పాకిస్తాన్ భూభాగానికి అత్యంత సమీపంలోనివి. 1971 యుద్ధం తర్వాత భారతీయ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో కూడా ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎల్ఓసీ దాటలేదు. ఇండియా మాత్రమే కాదు ఏ దేశమైనా ఇతర దేశానికి చెందిన గగనతలంలోకి ప్రవేశించి వైమానిక దాడులు జరిపిందంటే యుద్ధానికి సిద్ధం అన్న హెచ్చరిక పంపినట్టే.
Read this: Surgical Strike 2: మిరాజ్ 2000 యుద్ధ విమానం ప్రత్యేకత ఏంటీ?
2. ఇక 2016లో జరిపిన సర్జికల్ దాడుల్లో ఉపయోగించిన ఆయుధాల కంటే... ఈసారి జరిపిన సర్జికల్ దాడుల్లో జైష్-ఏ-మహ్మద్ శిబిరాలపై ప్రయోగించిన బాంబులు పరిమాణం చాలా ఎక్కువ. సుమారు 1,000 కిలోల లేజర్-గైడెడ్ బాంబుల్ని జైష్-ఏ-మహ్మద్ శిబిరాలపై ప్రయోగించింది భారత సైన్యం. ఈ దాడుల్లో సుమారు 200-300 మంది చనిపోయారని అంచనా. గతంలో జరిపిన దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 40-50 మంది ఉంటారని అంచనా.
Read this: Surgical Strike 2: 2016లో సర్జికల్ స్ట్రైక్-1... అప్పుడేం జరిగిందో తెలుసా?
3. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిపిన తాజా దాడులు పాకిస్తాన్ రక్షణ దళాలకు గట్టి హెచ్చరికను పంపాయి. సర్జికల్ స్ట్రైక్స్ 2.0 ద్వారా టెర్రరిస్టుల శిబిరాలపై దాడులు జరపడం మాత్రమే కాదు, పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌తో పూర్తిస్థాయి యుద్ధం చేయగల సత్తా, సామర్థ్యం భారతదేశానికి ఉందని హెచ్చరిక పంపడం కూడా మరో కారణం. పుల్వామా దాడులపై భారతదేశం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదని, తమ దేశం కూడా ప్రతీకారం తీర్చుకుంటుందని కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. పాక్ ప్రధాని బెదిరింపులకు భారత ప్రభుత్వం ఏమీ వణికిపోదని తాజా దాడులతో హెచ్చరిక పంపినట్టైంది.
Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'
ఇవి కూడా చదవండి:
Flipkart Month-end Mobile Fest: ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ మొదలైన స్మార్ట్‌ఫోన్ సేల్... ఆఫర్లు ఇవే
Nokia 9 PureView: ఐదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్‌వ్యూ... ఫీచర్లు ఇవే
Health Apps: బరువు తగ్గాలా? ఈ 7 యాప్స్ ట్రై చేయండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Air Force, Indian Army, Pulwama Terror Attack, Surgical Strike 2