హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Surgical Strike 2: 21 నిమిషాలు, 12 విమానాలు, 3 ప్రాంతాలు... పక్కా ప్లాన్

Surgical Strike 2: 21 నిమిషాలు, 12 విమానాలు, 3 ప్రాంతాలు... పక్కా ప్లాన్

భారత్ ఆర్మీ దాడులు జరిపిన ప్రాంతాలు

భారత్ ఆర్మీ దాడులు జరిపిన ప్రాంతాలు

Surgical Strike 2: బాలాకోట్‌లోని జైషే మహ్మద్ టెర్రర్ క్యాంపే లక్ష్యంగా భారత వాయుసేన దాడులు చేపట్టింది. భారత్ భూభాగానికి ఈ ప్రాంతం సుమారు 50 మైళ్ల దూరంలో ఉంది. అనంతరం ముజఫరాబాద్‌లోని టెర్రరిస్ట్ క్యాంప్‌లపై దాడికి దిగిన భారత వాయుసేన, అనంతరం చకోటిలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది.

ఇంకా చదవండి ...

  పుల్వామా ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్... దానికి తగ్గట్టుగానే ప్రతీకారం తీర్చుకుంది. ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదని భావించిన కేంద్రం... ఇందుకోసం పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్టు అర్థమవుతోంది. ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేయాలని నిర్ణయించుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ... పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్థావరాల్ని పూర్తిగా మట్టుబెట్టాలనే టార్గెట్‌తో కదనరంగంలోకి దూకింది. బాలాకోట్‌లోని జైషే మహ్మద్ టెర్రర్ క్యాంప్‌పై దాడులు చేశామని వైమానిక దళం ప్రకటించింది.

  ఇది భారత్ భూభాగానికి సుమారు 50 మైళ్ల దూరంలో ఉంది. ఆ తర్వాత ముజఫరాబాద్‌లోని టెర్రరిస్ట్ క్యాంప్‌లపై దాడికి దిగిన భారత వాయుసేన, అనంతరం చకోటిలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. బాలకోట్ ‌నుంచి ముజఫరాబాద్ 40 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ముజఫరాబాద్ నుంచి చకోటి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మూడు ప్రాంతాల్లో కలిపి కేవలం 21 నిమిషాల్లోనే దాడుల ప్రక్రియను భారత వాయుసేన పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 12 మిరాజ్ యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: India, Pakistan, Pulwama Terror Attack, Surgical Strike 2, Surgicalstrike2

  ఉత్తమ కథలు