మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా- ది మోదీ క్వశ్చన్'ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మూడు వారాల్లోగా కేంద్రం సమాధానం చెప్పాలని తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది.
2002 గుజరాత్ అల్లర్లపై రూపొందించిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా , న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Modi, Supreme Court