Home /News /national /

SUPREME COURTS COMMENTS ON FREEBIES IF YOU READ HOW THE HISTORY OF PROMISES BEGAN YOU WILL SAY WHAMMO UMG GH

Politicians Promises: దేశంలో ఉచిత పథకాల లిస్ట్ ఇదే..! కలర్ టీవీల నుంచి రోబోల వరకూ ఉచితంగా పంచినవే ఇవే..!!

 ఉచితాలపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు.. వాగ్దానాల చరిత్ర ఎలా మొదలయిందో చదివితే వామ్మో అంటారు !

ఉచితాలపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు.. వాగ్దానాల చరిత్ర ఎలా మొదలయిందో చదివితే వామ్మో అంటారు !

రాజకీయ పార్టీలు(Political PARTIES) ఓటర్లకు ఉచితాలను అందజేస్తే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టు(SUPREME Court)కు నివేదించింది. ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలు, అహేతుకమైన ఉచితాల పంపిణీ ఓటర్లను ఇన్‌ఫ్లూయన్స్‌ చేస్తుందని, పబ్లిక్ ఫండ్స్‌ దుర్వినియోగం అవుతున్నాయని అభిప్రాయపడింది.

ఇంకా చదవండి ...
రాజకీయ (Political)పార్టీలు ఓటర్లకు ఉచితాలను అందజేస్తే భారత ఆర్థిక(Economy) వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలు, అహేతుకమైన ఉచితాల పంపిణీ ఓటర్ల(Otters)ను ఇన్‌ఫ్లూయన్స్‌ చేస్తుందని, పబ్లిక్ ఫండ్స్‌ దుర్వినియోగం అవుతున్నాయని అభిప్రాయపడింది. స్వచ్ఛమైన ఎన్నికల ప్రక్రియ గాడి తప్పుతోందని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Pm Modi)ఇటీవల మాట్లాడుతూ ఓట్ల కోసం ఉచితాలను అందించే సంస్కృతి, దేశానికి చాలా ప్రమాదకరమని, ప్రజలను హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఓటర్లకు భారీ వాగ్దానాలు చేయడం దశాబ్దాలుగా భారతదేశ రాజకీయ నాయకులు పాటిస్తున్న ఆచారం. నగదు నుంచి మద్యం, గృహోపకరణాలు, స్కాలర్‌షిప్‌లు, సబ్సిడీలు, ఆహార ధాన్యాల వరకు చాలా అంశాలు వాగ్దానాల్లో భాగమవుతాయి. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు ప్రకటించిన, ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని హామీలను పరిశీలిద్దాం..

‘అమ్మ’ ఉచిత రాజకీయాలు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ అధ్యక్షురాలు జయలలిత ఉచిత రాజకీయాల మార్గదర్శకులలో ఒకరు. ఓటర్లకు ఉచిత విద్యుత్, మొబైల్ ఫోన్లు, వైఫై కనెక్షన్లు, సబ్సిడీ స్కూటర్లు, వడ్డీలేని రుణాలు, ఫ్యాన్లు, మిక్సీలు-గ్రైండర్లు, స్కాలర్‌షిప్‌లు వంటి మరెన్నో వాగ్దానం చేశారు. ఆమె ప్రారంభించిన అమ్మ క్యాంటీన్ చైన్ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఆమె మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై నుంచి ఈ వారసత్వాన్ని అందుకున్నారు. ఆయన 1960లలో కిలో బియ్యం రూపాయికి అందించారు.

టీవీ మూమెంట్‌
తమిళనాడులో ఉచిత రాజకీయాల్లో డీఎంకే వెనుకంజ వేయలేదు. 2006లో ప్రజలకు ఉచిత కలర్ టెలివిజన్ సెట్లు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న(BPL) కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని పార్టీ వాగ్దానాలు చేసింది. అయితే 2011లో తిరిగి అధికారంలోకి వచ్చిన జయలలిత.. డీఎంకే కలర్ టీవీ పథకాన్ని రద్దు చేశారు.

క్యాష్-ఫర్-ఓట్స్‌, వికీలీక్స్
2011లో తమిళనాడులో ఓట్ల కోసం నగదు కుంభకోణం వెలుగుచూసింది. 2009 తిరుమంగళం ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ నాయకులు ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించినట్లు అంగీకరించారని వికీలీక్స్ కేబుల్ తెలిపింది. డీఎంకే నగదు పంపిణీ కార్యక్రమాలను కేబుల్ వివరించింది. సాధారణంగా అర్ధరాత్రి ఓటర్లకు నగదు పంపిణీ చేసేవారు. తిరుమంగళంలో ఈ పద్ధతిని పక్కనపెట్టి డీఎంకే కొత్త మార్గాన్ని అనుసరించింది. ఎన్వలప్‌ కవర్‌లలో డబ్బును ఉంచి, వాటిని దినపత్రికల్లో ఉంచి ఇంటింటికీ పంపిణీ చేసింది. డబ్బుతో పాటు, కవరులో డీఎంకే ‘ఓటింగ్ స్లిప్’ ఉంది. ప్రతి ఒక్కరూ లంచం తీసుకోవాలని డీఎంకే బలవంతం చేసినట్లు కనిపించిందని కేబుల్ పేర్కొంది.

కీలకమైన అంశాలపై దృష్టి పెట్టడం
2013లో ఉత్తరప్రదేశ్‌లోని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకమైన ఉచిత ల్యాప్‌టాప్ పథకాన్ని ప్రకటించింది. దీని వల్ల అతను గొప్ప ప్రజాదరణ పొందారని, ముఖ్యంగా యువతలో నమ్మకం పెంచుకున్నారని నిపుణులు చెబుతారు. రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి 2015 మధ్య మొత్తం 15 లక్షల ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసింది.

విత్తనాలు విత్తడం
ఇతర అంశాలతోపాటు, రైతులకు ఉచిత విద్యుత్తు హామీతో పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ 1997లో అధికారంలోకి వచ్చింది. అయితే ఈ పథకం అమలుతో ఖజానాపై తీవ్ర భారం పడింది. దీంతో 2002లో కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌, ఆ పథకాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత పునరుద్ధరించే పేరుతో తాత్కాలికంగా రద్దు చేశారు.

ఇదీ చదవండి: Income Tax Returns: గడువు లోగా ఐటీఆర్ ఫైల్ చేయలేదా ? అయితే ఎన్ని ప్రయోజనాలు కోల్పోతారో తెలుసా !ఆప్‌ ‘ఆయుధాలు’
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఉచిత రాజకీయాలకు అతిపెద్ద మోడల్‌గా కనిపిస్తోంది. ఢిల్లీలో 2015 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆమ్‌ ఆద్మీ ఘన విజయం అందుకుంది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆడిట్ ద్వారా వినియోగదారుల విద్యుత్ వ్యయాన్ని 50 శాతం తగ్గించి, ప్రతి ఇంటికి రోజుకు 700 లీటర్ల ఉచిత నీటిని ఇస్తామని ఆప్‌ వాగ్దానం చేసింది. పంజాబ్‌లో విజయం సాధించిన ఆప్‌.. ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టేందుకు.. యువతకు స్కాలర్‌షిప్‌లు, వృద్ధులకు తీర్థయాత్రలు, మహిళలకు నగదు సాయం వంటి ఉచితాలను ప్రయోగిస్తోంది.చంద్రుని యాత్ర
గత సంవత్సరం తమిళనాడు ఎన్నికలలో, దక్షిణ మదురై స్థానం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తులం శరవణన్ పోటీ చేశారు. ఎన్నికల సమయంలో చంద్రుని పైకి 100 రోజుల యాత్ర, ఐఫోన్‌లు, గృహిణులకు వారి ఇంటి పనులలో సహాయం చేయడానికి రోబోలు, ప్రతి ఒక్కరికీ స్విమ్మింగ్ పూల్స్‌తో మూడు అంతస్తుల ఇళ్ళు, మినీ-హెలికాప్టర్లు, మహిళలకు వారి వివాహానికి 100 సవర్ల బంగారం, ప్రతి కుటుంబానికి ఒక పడవ, వ్యాపార వెంచర్లు ప్రారంభించడానికి యువతకు రూ.50,000 వంటి హామీలు ప్రకటించాడు. అయితే ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు.
Published by:Mahesh
First published:

Tags: AAP, DMK, Pm modi, Politics, Supreme Court

తదుపరి వార్తలు