కేరళ పద్మనాభస్వామి ఆలయ ఆరో గది తెరుస్తారా? సుప్రీంకోర్టు తీర్పు ఇదీ...

పద్మనాభస్వామి ఆలయ ఆరో గది తెరవాలా వద్దా అనే అంశంపై ఎన్నో రకాల వాదనలు నడిచాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తన తీర్పు ఇచ్చింది.

news18-telugu
Updated: July 13, 2020, 11:05 AM IST
కేరళ పద్మనాభస్వామి ఆలయ ఆరో గది తెరుస్తారా? సుప్రీంకోర్టు తీర్పు ఇదీ...
కేరళ పద్మనాభస్వామి ఆలయ ఆరో గది తెరుస్తారా? సుప్రీంకోర్టు తీర్పు ఇదీ...
  • Share this:
మన దేశంలో రహస్యాలు ఎన్నో. వాటిలో అందరి దృష్టినీ ఆకర్షించిందీ... ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేసిన అంశం... కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని ఆరో గది అంశం. ఆ గదిని తెరవాలని కొదరు, తెరవకూడదని మరికొందరు... ఇలా ఎవరికి వారు తమ తమ బలమైన వాదనలు వినిపించారు. తాజాగా సుప్రీంకోర్టు... ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబానికే చెందుతాయని తెలిపింది. అందువల్ల ఆరోగది తెరవాలా వద్దా అనేది ఇప్పుడు ట్రావెన్‌కోర్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకోనుంది. ఇదివరకు ఐదు గదులను తెరిచిన నిపుణులు... ఆరో గదిని మాత్రం తెరవలేదు. ఎందుకంటే... దానికి నాగబంధం ఉందనీ... ఎలాబడితే అలా తెరిస్తే... ప్రళయం తప్పదని కొందరు వాదించారు. ఆరో గదిలో నిధి నిక్షేపాలు ఉన్నాయనీ... వాటిని కాపాడేందుకే... ఆ గదిగి నాగ బంధం వేశారనీ... ఆ గదిని తెరవాలంటే... గరుడ మంత్రంతోనే సాధ్యమని అంటున్నారు. ఐతే... ఇప్పుడు దేశంలో ఆ గరుడ మంత్రం వేసి... నాగ బంధాన్ని తెరిచేవాళ్లు లేరని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు దైవ నమ్మకాలు, ఇటు సైంటిఫిక్ అంశాల్ని లెక్కలోకి తీసుకొని... ఆరోగదిని తెరిచేదీ లేనిదీ సుప్రీంకోర్టు ట్రావెన్ కోర్ ఫ్యామిలీకే వదిలేసినట్లైంది.

2011లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రతినిధుల టీమ్... కేరళ వెళ్లి... ఆలయ గర్భంలోని... ఐదు గదులను తెరిచారు. ఆ గదుల్లో వారికి దాదాపు రూ.1లక్ష కోట్ల విలువైన నగలు, విగరహాలు, ఆయుధాలు, వస్తువులు, నాణేలు లభించాయి. కానీ... వాళ్లు ఆరో గదిని తెరిచే విషయంలో వివాదం చెలరేగింది. ఎందుకంటే దాని తలుపులకు నాగబంధం ఉండటమే. పురాణాల ప్రకారం... అత్యంత కీలకమైన అంశాల విషయంలోనే ఈ నాగబంధం వేస్తారు. నాగ బంధం ఉన్న తలుపుల్ని తెరిస్తే... నల్లతాచుల కాటులో క్షణాల్లో చనిపోతారని ప్రచారం జరిగింది. దానికి తోడు... అప్పట్లో ఐదు గదులను తెరుస్తున్న సమయంలో... ఆలయంలో ఒకరు చనిపోయారు కూడా. దాంతో... ఆరో తలుపును తెరిచేందుకు ప్రతినిధుల బృందం సాహసం చెయ్యలేకపోయింది.

ట్రావెన్ కోర్ - ఓ గైడ్ బుక్ ఫర్ ది విజిటర్ అనే పుస్తకంలో రాసిన విషయాలు కూడా భయం కల్పించాయి. 1931లో ఆరో గదిని తెరిచేందుకు ప్రయత్నించిన వారికి అడుగడుగునా నల్ల తాజులు కనిపించడంతో... వారంతా తలోదిక్కుకూ పారిపోయారని అందులో రాసివుంది. ఐతే... మాజీ కాగ్ వినోద్ రాయ్... నేతృత్వంలోని టీమ్... కొంతవరకూ భయాల్ని పోగొట్టింది. 2014లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో... 1990 నుంచి ఆరో గదిని ఏడుసార్లు తెరిచారని చెప్పింది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తాజా తీర్పు ఇచ్చింది.
Published by: Krishna Kumar N
First published: July 13, 2020, 11:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading