SUPREME COURT TO PRONOUNCE TOMORROW ITS VERDICT ON BRINGING OFFICE OF CJI UNDER RTI ACT SK
రేపు మరో కీలక తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు
ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 4న తుది తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా..? లేదంటే తప్పుబడుతుందా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
దశాబ్దాల నాటి అయోధ్య కేసులో చారిత్రాత్మక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. బుధవారం మరో కీలక తీర్పుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలన్న కేసుపై తుది తీర్పు వెలువరించనుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తీర్పును చెప్పనుంది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, డీవై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు.
2010లో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టుతో పాటు సీజేఏ ఆఫీసులు కూడా ప్రభుత్వ సంస్థలేనని.. అవి ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అప్పీల్‌కు వెళ్లారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 4న తుది తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా..? లేదంటే తప్పుబడుతుందా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.