ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

సుప్రీంకోర్టు (File)

Jammu and Kashmir : జమ్మూకాశ్మీర్‌లో 40 రోజులుగా ఆంక్షలు అమలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయంపై పట్టుదలతో ఉంది. ఐతే... సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తికరం.

  • Share this:
జమ్మూకాశ్మీర్‌కి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చెయ్యడంతో... ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ... చాలా మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి అభ్యర్థనలు ఎక్కువైపోవడంతో... అన్నింటినీ ఒకేసారి పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. అది ఈ రోజే. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటు అంశాలపై వచ్చిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జడ్జిలు SA బాబ్డే, S అబ్దుల్ నజీర్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం పరిశీలించనుంది. చిత్రమేంటంటే... ఈ పిటిషన్లలో కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వేసిన వ్యక్తిగత పిటిషన్ కూడా ఉంది. జమ్మూకాశ్మీర్‌లోని తన కుటుంబ సభ్యుల్ని చూసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. ఇందుకు బలమైన కారణం ఉంది. ఇటీవల ఆయన కాశ్మీర్ వెళ్లేందుకు ప్రయత్నించగా... రెండుసార్లు ఆయన్ని ఎయిర్‌పోర్ట్ నుంచే ఢిల్లీకి పంపేశారు. మరి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏం చెబుతుంది. కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఐతే... ఎక్కువ మంది కేంద్ర నిర్ణయానికి సుప్రీంకోర్టు అడ్డుచెప్పకపోవచ్చంటున్నారు.

ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంతత లేదు. ఆంక్షల మధ్యే పనులు జరుగుతున్నాయి. అక్కడ దాదాపు 24 మంది ఉగ్రవాదులు ఉన్నారనీ, వాళ్ల అంతు చూస్తామనీ సైన్యం చెబుతోంది. ఇక అక్కడక్కడా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అరెస్టుల పర్వమూ నడుస్తోంది. ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్‌లా ప్రజల మధ్యే తిరుగుతూ... స్థానిక షాపుల యజమానులను బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితులు ఎప్పటికి మారుతాయో, ఎప్పటికి ప్రశాంత వాతావరణం వస్తుందో ఇప్పుడే చెప్పలేనట్లు ఉన్నాయి అక్కడి పరిణామాలు.
Published by:Krishna Kumar N
First published: