హోమ్ /వార్తలు /జాతీయం /

ఆర్టికల్ 35 Aపై సుప్రీం కోర్టు లో విచారణ... అసలేంటి ఈ అధికరణం... దీనికీ, జమ్మూ కాశ్మీర్‌ కీ లింకేంటి?

ఆర్టికల్ 35 Aపై సుప్రీం కోర్టు లో విచారణ... అసలేంటి ఈ అధికరణం... దీనికీ, జమ్మూ కాశ్మీర్‌ కీ లింకేంటి?

మెహబూబా ముఫ్తీ, సుప్రీంకోర్టు (Image : Twitter)

మెహబూబా ముఫ్తీ, సుప్రీంకోర్టు (Image : Twitter)

Article 35 A : ఓవైపు అల్లర్లతో జమ్మూ కాశ్మీర్ భగ్గుమంటుంటే... ఇదే సమయంలో వివాదాస్పద ఆర్టికల్ 35 ఏ పై సుప్రీం కోర్టు లో విచారణ జరగబోతుండటం ఆందోళన కలిగించే అంశమే. అల్లర్లు మరింత పెరుగుతాయా? సుప్రీం కోర్టు ఏం చెబుతుంది?

  జమ్మూ కాశ్మీర్‌లో మళ్లీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న రాజ్యాంగంలోని అధికరణం-35 ఏ (ఆర్టికల్ 35 ఏ)కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం, బుధవారం, గురువారం విచారించబోతోంది. ఆర్టికల్ 35 ఏ జోలికి వెళ్లడమంటే నిప్పుతో చెలగాటం ఆడటమే అని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో తేడా వస్తే 1947 నుంచీ మీరెప్పుడూ చూడనిది చూడాల్సి రావచ్చు అని ఆమె అన్నారు. ఆ ఆర్టికల్‌పై దాడి అంటూ జరిగితే త్రివర్ణ పతాకానికి బదులు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏ జెండా పట్టుకోవల్సి వస్తుందో నేను కూడా ఏమీ చెప్పలేను' అంటూ మెహబూబా ముఫ్తీ హాట్ కామెంట్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌ లో మరో కీలక పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ (NC) కూడా ఇలాంటి హెచ్చరికలే చేసింది.


  ఆర్టికల్ 35 ఏ అంటే ఏంటి : భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35 ఏ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తోంది. ఈ ఆర్టికల్ ని తొలగిస్తే ఊరుకునేది లేదని వేర్పాటువాద సంస్థలు కొంతకాలంగా హెచ్చరిస్తున్నాయి. ఆర్టికల్ 35 ఏ ను 1954లో అప్పటి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా భారత రాజ్యాంగంలోకి చేర్చారు. తద్వారా జమ్మూ కాశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు, అధికారాలు సంక్రమించాయి. అక్కడి వారిని శాశ్వతంగా ఉండేవారిగా ఆ ఆర్టికల్ గుర్తిస్తుంది. అందువల్ల బయటి వాళ్లెవరూ జమ్మూ కాశ్మీర్ లో ఉండకూడదు. అంటే... ఇతర రాష్ట్రాల ప్రజలు కాశ్మీర్ లో ఆస్తులు కొనకూడదు. ఇళ్లు నిర్మించుకోకూడదు. అంతే కాదు జమ్మూ కాశ్మీర్ కి చెందిన అమ్మాయి వేరే రాష్ట్రం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అప్పటివరకూ ఆమెకు దక్కాల్సిన ఆస్తులు ఇకపై ఆమెకు దక్కవు. వాటిపై హక్కును ఆమె కోల్పోయినట్లే.


  ఆర్టికల్ 35 ఏ ని రద్దు చెయ్యాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఆర్టికల్ పార్లమెంట్ ఆమోదం పొందలేదనీ... ఇది చెల్లదని కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారు. దేశంలో భాగమైన జమ్మూ కాశ్మీర్ లో కూడా భారత రాజ్యాంగం ప్రకారమే అన్నీ ఉండాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాశ్మీర్ ప్రజలు మాత్రం తమకంటూ ప్రత్యేక హక్కులు ఉండాల్సిందే అంటున్నారు. 28 వరకూ సుప్రీంకోర్టు జరిపే విచారణలో ఈ అంశాలన్నీ చర్చకు రాబోతున్నాయి.


  ఆర్టికల్ 35 ఏ కారణంగా జమ్మూ కాశ్మీర్ లో ఉద్యోగాలు ఆ రాష్ట్ర ప్రజలు మాత్రమే పొందుతున్నారు. స్కాలర్ షిప్స్, సంక్షేమ పథకాలకు కూడా అక్కడి వారే అర్హత పొందుతున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆర్టికల్ 35 ఏ చెల్లదని గానీ, దాన్ని పార్లమెంట్ ఆమోదానికి పంపాలని గానీ తీర్పు ఇస్తే... జమ్మూ కాశ్మీర్ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే ప్రమాదం కనిపిస్తోంది.


   


  ఇవి కూడా చదవండి :

  సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణ.... ఎలా సాగుతుంది? వివరాలేంటి?


  సమ్మర్‌లో సబ్జా గింజలు తాగితే చాలు... ఎంతో ఆరోగ్యం...


  కొబ్బరి బోండాంలో లేత కొబ్బరి తింటున్నారా... ఈ ప్రయోజనాలు మీకే

  First published:

  Tags: Jammu and Kashmir, Pulwama Terror Attack, Supreme Court

  ఉత్తమ కథలు